/rtv/media/media_files/2025/04/01/l2aUG0CP8gXPSwyXtBbR.jpg)
BJP
బీజేపీకి కొత్త జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు పార్టీ కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే వివిధ కారణాల వల్ల ఎన్నికల ఆలస్యం అయ్యింది. దీంతో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ముగిసిన వెంటనే ఈ ప్రక్రియ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. మరో వారం రాజుల్లో ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌తో పాటు వివిధ రాష్ట్రాలకు పార్టీ అధ్యక్షుల పేర్లు ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి 19 రాష్ట్రాలకు పార్టీ అధ్యక్షులను ప్రకటించిన తర్వాత జాతీయ అధ్యక్షుడి ఎన్నిక మొదలుపెట్టేలా హైకమాండ్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
Also Read: భర్తముందే భార్యపై గ్యాంగ్ రేప్.. ఊరికి వెళ్లి వస్తుండగా నడిరోడ్డుపై ఆపి!
ఇప్పటికే 13 రాష్ట్రాల్లో బీజేపీ అధిష్ఠానం సంస్థాగత ఎన్నికలు పూర్తి చేసి అధ్యక్షుల పేర్లు ఖరారు చేసింది. మిగతా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా వెంటనే ఈ ఎన్నికలు పూర్తి చేసేందుకు కృషి చేస్తోంది. బీజేపీ సంస్థాగత ఎన్నికలు మూడేళ్లకోసారి ఉంటాయన్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా 2019 నుంచి ఆ పదవిలో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన రెండో టర్మ్ 2024 జూన్‌లోనే ముగిసింది. అయినప్పటికీ ఆయన కేంద్రమంత్రిగా, పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుడి ఎన్నిక చేపట్టాలంటే 50 శాతం రాష్ట్రాల్లో పార్టీ సంస్థాగత ఎన్నికలు పూర్తి చేయాలి. దీనికన్నా ముందు బూత్, మండల, జిల్లా స్థాయిలకు కూడా ఎన్నికలు నిర్వహించాలి.
అయితే గతేడాది హర్యానా, జార్ఖండ్, మహారాష్ట్ర, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత పార్లమెంటు సమావేశాలు ఉండటం వల్ల ఆలస్యం జరిగింది. అయితే ఈసారి బీజేపీ అధ్యక్షుడిగా దక్షిణాది రాష్ట్రాలకు చెందిన నేతకే అప్పగిస్తారనే ప్రచారం నడుస్తోంది. ఇప్పటికే ఈ పదవి రేసులో ఏపీ బీజీపీ అధ్యక్షురాలు పురుందేశ్వరి, బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షుడు వనతి శ్రీనివాసన్, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మరో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: బంగ్లాలో పడిపోతున్న వస్త్ర పరిశ్రమ..200లకు పైగా ఫ్యాక్టరీలు క్లోజ్
rtv-news | bjp | national-news మరికొన్నిరోజుల్లో బీజీపీకి కొత్త జాతీయ అధ్యక్షుడు