Fadnavis : రచ్చ అవుతున్న బద్లాపూర్ నిందితుడి ఎన్‌కౌంటర్

బద్లాపూర్ లైంగికారోపణల నిందితుడు అక్షయ్ మృతి ఇప్పుడు మహారాష్ట్రలో పెద్ద వివాదం అవుతోంది. నిందితుడిపై ఎదురు కాల్పులు ఎందుకు చేశారని హైకోర్టు ప్రశ్నించగా..తమను గన్‌తో కాలుస్తుంటే పోలీసులు చప్పట్లు కొట్టాలా అని బీజేపీ నేత ఫడ్నవీస్ అంటున్నారు.

New Update
Badlapur Case: బద్లాపూర్ కేసులో నిందితుడికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ

Badlapur Case: 

మహారాష్ట్రలోని బద్లాపూర్ లో స్కూల్ పిల్లలను లైంగికంగా వేధించిన నిందితుడు అక్షయ్ పోలీసుల ఎదురు కాల్పుల్లో మరణించాడు. ఈ విషయం ఇప్పుడు అక్కడ రచ్చ అవుతోంది. నిందితుడిని విచారణ నిమిత్తం తీసుకువెళుతుంటే..కానిస్టేబుల్‌ దగ్గర గన్ లాక్కుని పోలీసులపై కాల్పులు జరిపాడని..దాంతో తమను తాము రక్షించుకోవడానికి ఎదురు కాల్పులు చేశామని మహారాష్ట్ర పోలీసులు చెప్పారు. ఆ ఎదురు కాల్పుల్లో అక్షయ్ చనిపోయాడని అన్నారు. 

అయితే ఈ విషయాన్ని అక్షయ్ తండ్రి మాత్రం ఒప్పుకోవడం లేదు. తన కొడుకును కావాలనే ఎన్‌కౌంటర్‌‌ చేశారని అతని తండ్రి హైకోర్టులో కేసు వేశారు. దీని విచారణను హైకోర్టు చేపట్టింది. ఇందులో భాగంగా ఒక సామాన్య మానవుడు ఎలా కాల్పులు జరుపుతాడు అంటూ హైకోర్టు పోలీసులను ప్రశ్నించింది. అసలు అతను ఎలా కానిస్టేబుల్ దగ్గర నుంచి గన్‌ను లాక్కోగలడని అడిగింది. అక్షయ్‌కు నేర చరిత్ర ఉన్న దాఖలాలు లేవని కోర్టు వ్యాఖ్యానించింది. నిందితుడు మూడు బుల్లెట్లు కాల్చే వరకు ఏం చేస్తున్నారని పోలీసులను ప్రశ్నించింది. నలుగురు పోలీస్ అధికారులు కలిపి ఒక్కరిని అదుపు చేయలేకపోయారా అని అడిగింది. అదీ కాకపోతే నిందితుడి మోకాలి కింద కాల్చి ఉండాల్సింది కదా అని చెప్పింది.

Also Read :  మరోసారి ఆల్ టైమ్ రికార్డ్.. జీవితకాల గరిష్టాలు నమోదు చేసిన మార్కెట్

దీని మీద ఈరోజు బీజేపీ నేత ఫడ్నవీస్ స్పందించారు. కావాలని బద్లాపూర్ నిందితుడి ఎదురు కాల్పుల్లో మృతి చెందడాన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని ఆయన అన్నారు. తాము కూడా ఎన్‌కౌంటర్‌‌కు వ్యతిరేకమేనని..చట్టాలను కచ్చితంగా అనుసరించాల్సిందేనని ఆయన అన్నారు. కానీ తమపై కాల్పులు జరుపుతుంటే పోలీసులు చప్పట్లు కొట్టరు. ఆత్మ రక్షణలో భాగంగానే అక్షయ్‌ను వారు కాల్చారు. ఒకవేళ అతడు తప్పించుకుని ఉంటే ఏం జరిగేది. దురదృష్టవశాత్తు ఎన్‌కౌంటర్‌లో పోలీసులకు గాయాలయ్యాయి. మనమంతా వారికి మద్దతివ్వాలి అని అన్నారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం కావాలనే అక్షయ్ పారిపోయేటట్లు చేసి పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారని ఆరోపిస్తున్నారు.

Also Read: మరోసారి ఆల్ టైమ్ రికార్డ్..జీవితకాల గరిష్టాలు నమోదు చేసిన మార్కెట్ 

Also Read :  Amazonలో అదిరే ఆఫర్లు.. ఈ 6 ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!

Also Read :  రచ్చ అవుతున్న బద్లాపూర్ నిందితుడు ఎన్‌కౌంటర్

Advertisment
Advertisment
తాజా కథనాలు