/rtv/media/media_files/2024/11/21/gjGg8SfemLAKsKhXv04h.jpg)
మామూలు ప్రజల సంగతి ఏమో కానీ అంతర్జాతీయంగా బిలియనీర్లు మాత్రం భారీగా నష్టపోతున్నారు. స్టాక్ మార్కెట్లు రోజుర్జుకూ దిగజారుతుండడంతో వారి సంపద మంచులా కరిగిపోతోంది. భారత స్టాక్ మార్కెట్ సూచీలు కూడా ఈ ఏడాదిలో ఇప్పటికే భారీగా పతనం అయ్యాయి. వరుస సెషన్లలో పెద్ద మొత్తంలో నష్టపోతూ ఇన్వెస్టర్లకు తీరని నష్టాల్ని మిగులుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే భారత బిలియనీర్ గౌతమ్ అదానీ కూడా భారీగా నష్టపోయారు. ఈయన సంపదలోని 1 లక్షా 25 వేల కోట్లు ఆవిరి అయిపోయాయి. అది కూడా కువలం 50 రోజుల వ్యవధిలోనే. అదానీ మొత్తం సంపద విలువ 11.9 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.1 లక్ష కోట్లు) తగ్గి 66.8 బిలియన్ డాలర్లకు పడిపోయింది.
Also Read: TS: చనిపోయారు,ఎలా విచారించాలి..రాజలింగమూర్తి పిటిషన్ పై హైకోర్టు
రెండవ స్థానంలో అదానీ..
2025 సంవత్సరంలో అత్యంత ఎక్కువ సంపద కోల్పోయిన వారిలో అదానీ రెండవ స్థానంలో ఉన్నారు. బ్లూమ్ బెర్గ్ బిలయనీర్ ఇండెక్స్ ప్రకారం మొదటి స్థానంలో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఉన్నారు. ఈయన అయితే ఏకంగా 3 లక్షల కోట్లను పోగొట్టుకున్నారు. దీంతో మస్క్ మొత్తం సంపద విలువ 397 బి. డాలర్లకు దిగివచ్చింది. గౌతమ్ అదానీ 23వ స్థానంలో ఉన్నారు. బ్లూమ్ బర్గ్ బిలయనీయర్స్ ఇండెక్స్ లో ప్రస్తుతం గౌతమ్ అదానీ 23 వస్థానంలో ఉన్నారు. అలాగే భారత మరో కుబేరుడు ముకేశ్ అంబానీ ఈ జాబితా 17వ స్థానంలో నిలిచారు. ఈయన సంపద ప్రస్తుత విలువ 2.9 బిలియన్ డాలర్లు తగ్గి 87.7 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. హెచ్‌సీఎల్ టెక్‌కు చెందిన శివ్‌నాడార్ సంపద 4.53 బిలియన్ డాలర్లు (సుమారు రూ.39,000 కోట్లు) తగ్గి 38.6 బిలియన్ డాలర్లు (రూ.3,32,000 కోట్లు)గా నమోదైంది. మొత్తానికి అందరి సంపదా ఎంతో కొంత అయితే పోయింది.
Also Read: Champions Trophy: అదరగొట్టిన సౌత్ ఆఫ్రికా...తేలిపోయిన ఆఫ్ఘాన్