VIRAL VIDEO: ఇదేం ఉద్యోగం తల్లి.. ‘వర్క్ ఫ్రమ్ కార్’.. పోలీసుల పనికి అంతా షాక్!

ల్యాప్‌టాప్‌లో వర్క్‌ చేసుకుంటూ, నిర్లక్ష్యంగా కారు డ్రైవ్ చేసిన ఓ మహిళపై బెంగళూరు ట్రాఫిక్‌ పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఆమెకు రూ.1000 జరిమానా విధించారు. ఆ మహిళ వీడియోతో పాటు అదుపులోకి తీసుకున్న ఫొటోను పోస్టు చేశారు. ఈ ఘటన ఆర్టీనగర్‌ ప్రాంతంలో జరిగింది.

New Update
Bengaluru woman working on a laptop while driving.

Bengaluru woman working on a laptop while driving

VIRAL VIDEO: వర్క్ ఫ్రమ్ హోమ్.. ఈ పదం ఎక్కువగా కరోనా కష్టకాలం నుంచి మొదలైంది. కరోనా వైరస్ కారణంగా చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్(Work From Home) సదుపాయాన్ని కల్పించాయి. అయితే ఇప్పుడిప్పుడే కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులను ఆఫీసుకు రమ్మంటున్నాయి. మరికొన్ని కంపెనీలు మాత్రం అదే సదుపాయాన్ని కొనసాగిస్తున్నాయి. 

Also read :  మేఘా కృష్ణారెడ్డికి బిగ్ షాక్.. ముంబై హైకోర్టులో జర్నలిస్ట్ రవి ప్రకాష్ పిల్!

అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే అందరికీ తెలిసిందే.. తమ ఉద్యోగానికి సంబంధించిన వర్క్‌ను ఇంటి వద్ద ఉండి చేసేది. కానీ కొందరు మాత్రం ఇతర పనులు పెట్టుకుని.. బస్సులు, ట్రైన్స్‌లలో జర్నీ చేసేటప్పుడే ల్యాప్‌టాప్‌లో వర్క్ చేస్తుంటారు. అప్పుడప్పుడు ఇలాంటివి చూస్తూనే ఉంటాం. అయితే తాజాగా అలాంటిదే జరిగి వివాదాస్పదంగా మారింది. 

Also Read :  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లికి బిగ్ షాక్.. పోలీసులు నోటీసులు

కారులో వర్క్(Work From Car)

బెంగళూరుకు చెందిన ఓ మహిళ ఏకంగా కారులో వర్క్ చేసింది. అదేంటి కారులో వర్క్ చేస్తే తప్పేముంది అని అనుకోకండి.. ఆమె కారులో డ్రైవ్ చూస్తూ వర్క్ చేసింది. ఈ ఘటన బెంగళూరులోని ఆర్టీ నగర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో వైరల్ కాడంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

Also Read :  ముందుకూ, వెనక్కూ ఊగిసలాడుతున్న స్టాక్ మార్కెట్లు

ఓ మహిళ కారు డ్రైవ్ చేస్తూనే ల్యాప్‌టాప్‌ను స్టీరింగ్ ముందు పెట్టుకొని వర్క్ చేస్తుంది. దీన్ని పక్కనే మరొక కారులో వెళ్తున్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అది కాస్తా ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. దీంతో ఈ విషయం ట్రాఫిక్ పోలీసుల వరకు వెళ్లడంతో వారు రంగంలోకి దిగారు. 

Also Read : రామరాజ్యం ఆర్మీ పేరుతో అరాచకాలు.. వీరరాఘవరెడ్డి బాగోతం బయటపెట్టిన RTV!

రూ.1000 జరిమానా

ఆమెను ట్రాక్ చేసి రూ.1000 జరిమానా విధించారు అంతేకాకుండా వాహనదారుల్లో అవగాహన కోసం ఆ మహిళ వీడియోతో పాటు.. ఆమెను అదుపులోకి తీసుకుని జరిమానా విధించినట్లు ఉన్న ఫొటోను ట్రాఫిక్ డీసీపీ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు