/rtv/media/media_files/2025/03/23/vGKXXbrxLRiloESYlJ8e.jpg)
Banks strike postponed
మార్చి 24, 25 తేదీల్లో చేపట్టనున్న దేశవ్యాప్తంగా బ్యాంకుల సమ్మే వాయిదా పడింది. యూనైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఈ విషయాన్ని వెల్లడించింది. సెంట్రల్ లేబర్ కమిషనర్‌తో శుక్రవారం నిర్వహిచిన చర్చలు సానుకూల ఫలితాలు ఇచ్చినట్లు పేర్కొంది. బ్యాంకులకు ఐదు రోజుల పనిదినాలు, నియామకాలు, పనితీరు ప్రోత్సహకాలతో పాటు ఇతర విషయాలపై మరింతగా చర్చించాలని ప్రతిపాదించినట్లు పేర్కొంది.
Also Read: రాజీవ్ యువ వికాసం పథకం.. ప్రభుత్వం కీలక నిర్ణయం
తాము చేసిన డిమాండ్ల పట్ల సానుకూల పరిణామాలు వచ్చాయని తెలిపింది. ఈ క్రమంలోనే సమ్మెను ఒకట్రెండు నెలల పాటు వాయిదా వేయాలని కోరినట్లు చెప్పింది. తదుపరి చర్చలు ఏప్రిల్ మూడో వారంలో జరుగుతాయని పేర్కొంది.
Also Read: కిచెన్ లో ఖాళీ బుల్లెట్లతో పోలీస్ ఆఫీసర్ ప్రయోగం.. చివరికి ఏమైందంటే..?
బ్యాంకుల్లో తగినంత నియామకాలు, అన్ని శాఖలలో సెక్యూరిటీ గార్డులను నియమించడం, ఐదు రోజుల బ్యాంకింగ్ పనిదినాలు, పాత పెన్షన్ పునరుద్ధరణ, అలాగే ప్రవేట్ వ్యక్తులకు వివిధ పనులను అప్పగించడం వంటి వాటికి వ్యతిరేకంగా బ్యాంకు ఉద్యోగులు నిరసన తెలుపుతున్నారు. దీనితో పాటు, కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్ధీకరించాలనే డిమాండ్లు ఉన్నాయి.ఈ క్రమంలోనే మార్చి 24, 25 తేదీల్లో చేపట్టనున్న దేశవ్యాప్తంగా బ్యాంకుల సమ్మేకు పిలుపునిచ్చారు. సెంట్రల్ లేబర్ కమిషనర్‌తో శుక్రవారం నిర్వహిచిన చర్చలు సానుకూల ఫలితాలు రావడంతో సమ్మే వాయిదా పడింది.
Also Read: ఇండోనేషియాలో ముగ్గురు భారతీయులకు మరణ శిక్ష..?!
Also Read: ఉరుముల, మెరుపులతో కూడిన వర్షం.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
rtv-news | banks | telugu-news | national-news