/rtv/media/media_files/2025/03/17/d7S8cnUuWZs2k5p2OHdY.jpg)
Bank deputy manager cheating elderly woman out of Rs 50 lakh in Bengaluru
కర్ణాటకలో దారుణం జరిగింది. ఓ ప్రైవేటు బ్యాంకు మేనేజర్ వృద్ధ దంపతుల నుంచి రూ.50 లక్షలు కాజేసిన ఘటన చోటుచేసుకుంది. చివరికి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ బ్యాంకు మేనేజర్‌ను అరెస్టు చేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరులోని గిరినగర్‌లో ఓ ప్రైవేట్ బ్యాంక్‌లో వృద్ధ దంపతులు జాయింట్ అకౌంట్ తెరిచారు. అందులో కొంతమొత్తం డిపాజిట్ కూడా చేశారు. అయితే బ్యాంక్ డిప్యూటీ మేనేజర్ మేఘనా పరిచయం ఉండటంతో ఆ వృద్ధ దంపతులు తమ కష్టాలు ఆమెకు చెప్పుకునేవారు.
Also Read: బట్టతలపై భార్య హేళన చేయడంతో.. భర్త ఆత్మహత్య
దీంతో ఇటీవల ఓ ఇంటిని కూడా విక్రయించి రూ.కోటి జమ చేశారు. ఆ డబ్బుపై డిప్యూటీ మేనెజర్ మేఘన కన్ను పడింది. బాండ్ టైం ముగిసిందని.. కొత్తగా డిపాజిట్ చేయడం కోసం చెక్ అవసరమైన మభ్యపెట్టి కొన్ని డ్యాకుమెంట్లపై కూడా సంతకాలు చేయించుకుంది. ఆ తర్వాత రూ.50 లక్షలను తన ఖాతాలోకి బదిలీ చేయించుకుంది.
Also Read: పాకిస్థాన్‌లో ఎయిర్‌పోర్టులో దాడులు.. మరో ఉగ్రవాది హతం !
అయితే వృద్ధ దంపతుల కుమారుడు బ్యాంకు లావాదేవీలను పరిశీలించాడు. ఖాతాలో నగదు తక్కువగా కనిపించింది. దీంతో వెంటనే బ్యాంకుకు వెళ్లి మేఘనాను నిలదీశారు. మీరు చెప్పిన ఖాతాకు నగదు బదిలీ చేశానని మెఘనా బదులిచ్చింది. చివరికి బాధితులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు దర్యాప్తులో మేఘనా కపట మోసం బయటపడింది. ఆమెతో పాటు తన భర్త శివప్రసాద్, స్నేహితులు వరదరాద్, అన్వర్‌ఘోష్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. వృద్ధ దంపతులను మోసం చేసిన ఆ బ్యాంకు మేనేజర్‌పై స్థానికులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిని సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
Also Read: మాజీ అనొద్దు ఫ్లీజ్..మేమింకా విడిపోలేదు....సైరాభాను ఆసక్తికర వ్యాఖ్యలు
Also Read: శాంతి కోసం ప్రయత్నిస్తే..పాక్ నమ్మకం ద్రోహం చేసింది-ప్రధాని మోదీ