Bangladesh: పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం.. బంగ్లాదేశ్‌కు గుడ్‌న్యూస్

పశ్చిమ బెంగాల్‌లో ప్రభంజనం సృష్టించిన బీజేపీ మొదటిసారిగా అధికార పీఠం దక్కించుకుంది. మే 9న కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఈ చారిత్రాత్మక రాజకీయ మార్పు పొరుగుదేశమైన బంగ్లాదేశ్‌కు అనుకూలంగా మారనుంది.

New Update
Bangladesh ruling party sees hope in BJP Bengal win

Bangladesh ruling party sees hope in BJP Bengal win

పశ్చిమ బెంగాల్‌లో ప్రభంజనం సృష్టించిన బీజేపీ మొదటిసారిగా అధికార పీఠం దక్కించుకుంది. మే 9న కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఈ చారిత్రాత్మక రాజకీయ మార్పు పొరుగుదేశమైన బంగ్లాదేశ్‌కు అనుకూలంగా మారనుంది. భారత్-బంగ్లాదేశ్‌ మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న తీస్తా నది జలాల వివాదానికి పరిష్కారం దొరికే అవకాశం ఉన్నట్లు రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. దీంతో బంగ్లాదేశ్‌లో నీటి కష్టాలు తీరే పరిస్థితులు రానున్నట్లు చెబుతున్నారు. బెంగాల్‌లో బీజేపీ గెలుపును బంగ్లాదేశ్‌ నేషనల్ పార్టీ (BNP) కూడా స్వాగతించింది.

గతంలో మమతా బెనర్జీ ప్రభుత్వం అడ్డుకున్న తీస్తా ఒప్పందం ఇప్పుడైనా కొలిక్కి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తోంది. అంతేకాదు రాష్ట్రంలో, కేంద్రంలో ఒకే ప్రభుత్వం ఉండటం వల్ల నిర్ణయాలు అమలు చేసే విషయంలో ఇప్పటిదాకా ఉన్న అడ్డంకులు తొలగిపోతాయని అజీజుల్‌ బరీ హెలాల్ లాంటి నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.    

2011లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం తీస్తా నది జలాల పంపిణీ విషయంలో  ఓ ముసాయిదా ఒప్పందాన్ని తయారుచేసింది. ఈ ఒప్పందం ప్రకారం నది జలాలను భారత్‌కు 42.5 శాతం వాటా కేటాయించాలి. బంగ్లాదేశ్‌కు 37.5 శాతం అందించాలి. ఇక మిగిలిన 20 శాతాన్ని పర్యావరణ అవసరాల కోసం వినియోగించాలని ప్రతిపాదన చేశారు. ఈ ఒప్పందం వల్ల ఉత్తర బెంగాల్‌లో ఉన్న రైతుల వ్యవసాయ ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని అప్పటి సీఎం మమతా బెనర్జీ వాదించారు. తీస్తా నది జలాల ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అప్పటి నుంచి ఈ వివాదం పరిష్కారం కాకుండా అలాగే కొనసాగుతోంది.

Also Read: ఆ కండిషన్ కు ఒప్పుకుంటేనే విజయ్ కు సపోర్ట్.. కాంగ్రెస్ బిగ్ ట్విస్ట్.. అధికారికంగా లేఖ!

గత కొన్నేళ్ల నుంచి మమతా బెనర్జీ సర్కార్ కేంద్రం తీసుకునే నిర్ణయాలకు సహకరించడం లేదు. దీంతో తీస్తా ఒప్పందంపై ప్రతిష్టంభన ఉంది. ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ పార్టీ ఓడిపోయింది. మరో మూడు రోజుల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. దీంతో రాష్ట్రంలోని బీజేపీ సర్కారు కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని తీస్తా ఒప్పందాన్ని పరిష్కరించేలా మార్గం చూపిస్తుందని బంగ్లాదేశ్ భావిస్తోంది. మోదీ ప్రభుత్వం కూడా మొదటి నుంచే బంగ్లాదేశ్‌తో సత్సంబంధాల కోసం ఈ ఒప్పందానికి అనుకూలంగానే ఉంది. కానీ దీదీ ప్రభుత్వ వ్యతిరేకత వల్ల దీనికి అవరోధంగా మారింది. ప్రభుత్వం మార్పుతో ఇప్పుడు ఆ అడ్డంకి తొలగిపోయిందని బంగ్లాదేశ్ నేతలు విశ్లేషిస్తున్నారు.

తీస్తా వివాదం అనేది కేవలం నీటి సమస్య మాత్రమే కాదు. భారత్‌-బంగ్లాదేశ్‌ మధ్య భౌగోళిక రాజకీయ ప్రాధాన్యత కలిగిన కీలక అంశంగా ఉంది. బంగ్లాదేశ్‌లోని సుమారు రెండు కోట్ల మంది ప్రజలు తమ జీవనోపాధి కోసం తీస్తా నది జలాలపైనే ఆధారపడుతున్నారు. కానీ నీటి పంపిణీలో ఆలస్యం వల్ల బంగ్లాదేశ్ ప్రత్యామ్నాయంగా చైనా వైపు చూస్తోంది. చైనా సపోర్ట్‌తో 'తీస్తా రివర్ కాంప్రహెన్సివ్ మేనేజ్‌మెంట్ అండ్ రిస్టోరేషన్ ప్రాజెక్ట్'ను చేపట్టాలని భావిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ దక్షిణాసియాలో భారత్ ప్రాధాన్యతను తగ్గించే ప్రమాదం ఉందని దౌత్యవేత్తలు వార్నింగ్ ఇస్తున్నారు. 

Also Read: త్రిషకు విజయ్‌ బిగ్‌షాక్..తిరుచ్చి ఈస్ట్‌ నుంచి నో టికెట్!

మరోవైపు 1996లో గంగా జలాల ఒప్పందం కుదిరింది. అయితే ఈ గడువు ఈ ఏడాది చివర్లోనే ముగియనుంది. దీంతో తీస్తా జలాల్లో తమకు న్యాయపరమైన వాటా ఇవ్వాలని బంగ్లాదేశ్ అడుగుతోంది. పశ్చిమ బెంగాల్ తన సొంత నీటి అవసరాల వల్ల దీన్ని వ్యతిరేకిస్తుండటంతో ఈ ఒప్పందం పెండింగ్‌లోనే ఉంది. అంతేకాదు వాతావరణ మార్పులు చోటుచేసుకోవడం వల్ల నదిలో నీటి లభ్యత కూడా క్రమంగా తగ్గుతోంది. అందుకే బెంగాల్‌లో ఏర్పాటుకానున్న బీజేపీ ప్రభుత్వం.. ఈ సమస్యలను పరిష్కరిస్తుందని బంగ్లాదేశ్ ఆశిస్తోంది. 

Advertisment
తాజా కథనాలు