ఢిల్లీని ముంచెత్తిన వానలు..ఎల్లో అలెర్ట్..100 ఏళ్ళల్లో ఇదే మొదటసారి

గత వందేళ్ళల్లో ఎన్నడూ లేని విధంగా ఢిల్లీని వానలు ముంచెత్తుతున్నాయి. కేవలం 24 గ్ంటల్లో 41.2 మిల్లీ మీటర్ల వాన పడింది. దీంతో ఢిల్లీలో ఎల్లో అలెర్ట్ జారీ చేశారు.  మరో రెండు రోజులు ఇలానే వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

New Update
rains

Yellow Alert To Delhi

డిసెంబర్ లో ఇంతలా వానలు కురవడం 101 సంవత్సరాలలో ఇదే తొలిసారి. ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో ఈరోజు ఉదయం 8:30 గంటల వరకు 24 గంటల్లో 41.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇంతా ఢల్లీలో వాన పడడం చివరిగా 1923 డిసెంబర్ 3న నమోదైంది. అప్పట్లో ఒకేరోజు 75.7 మి.మీ. కురిసి ఢిల్లీని అతలాకుతలం చేసింది. ఇక నిన్న సాయంత్రం  5:30 గంటల వరకు నగరవ్యాప్తంగా 31.4 మిమీ, పాలెం వద్ద 31.4 మిమీ, లోధి రోడ్‌లో 34.2 మిమీ, రిడ్జ్‌లో 33.4 మిమీ, ఢిల్లీ యూనివర్సిటీలో 39 మిమీ, పూసాలో 35 మిమీ వర్షపాతం నమోదైంది.

ఎల్లో అలెర్ట్...

అసలే డిసెంబర్‌‌లో చాలా చలిగా ఉంటుంది. దానికి తోడు ఇప్పుడు వానలు కూడా పడుతుండడంతో ఢిల్లీకి ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. మరో రెండు రోజులు ఇలానే వర్షం పడే అవకాశం ఉందని...అందరూ జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. వీకెండ్లో ఉష్ణోగత్రలు మరింత పడిపోవచ్చని హెచ్చరించింది. ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్ మరియు కనిష్టంగా 12 డిగ్రీల సెల్సియస్ ఉండవచ్చని తెలిపింది. అయితే ఇప్పుడు కురిసిన వర్షపాతం వలన ఒక మంచి కూడా జరిగింది. చాలా నెల నుంచి పొల్యూషన్‌లో కూరుకుపోయిన ఢిల్లీ ఇప్పుడు కాస్త ఊపిరి పీల్చుకోగలుగుతోంది.  ఢిల్లీలో గాలి నాణ్యత కాస్త మెరుగుపడిందని పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తెలిపింది. ఉదయం 11 గంటలకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 142తో నాణ్యత కొద్దిగా పెరగటానికి వర్షపాతం దోహదపడింది.

Also Read: చెన్నై గ్యాంగ్‌ రేప్ ఘటన.. నిందితుడికి డీఎంకేతో సంబంధాలు !

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Heatwave Warning : బయటకు వెళ్తున్నారా? జాగ్రత్త...ఈ రోజు మండనున్న ఎండలు..అరెంజ్‌ అలర్ట్‌

ఒకవైపు విపరీతమైన ఎండలు, మరోవైపు వర్షాలతో రెండు తెలుగు రాష్ట్రాల్లోవాతావరణం బెంబేలెత్తిస్తుంది. ఉదయమంతా వడగాల్పులతో సతమతమవుతుంటే, సాయంత్రం అయ్యేసరికి వాతావరణం మారి వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో  ఈ రోజు కూడా వడగాలులతో పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

New Update
Heatwave Warning

Heatwave Warning


Heatwave Warning : ఒకవైపు విపరీతమైన ఎండలు, మరోవైపు వర్షాలతో రెండు తెలుగు రాష్ర్టాల్లో వాతావరణం బెంబేలెత్తిస్తుంది. ఉదయమంతా వడగాల్పులతో సతమతమవుతుంటే, సాయంత్రం అయ్యేసరికి వాతావరణం మారి వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో  ఈ రోజు కూడా వడగాలులతో పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవరణ శాఖ వెల్లడించింది. రెండు రాష్ర్టాల్లోనూ ఈ రోజు  ఉష్ణోగ్రతలు పెరగడంతోపాటు తీవ్ర వడగాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. అంతేకాకుండా పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కూడా కురుస్తాయిని అధికారులు పేర్కొన్నారు.

Also Read: ఈ సారి సైన్యం కాదు.. పర్యాటకులే టార్గెట్.. ఉగ్రమూకల కొత్త వ్యూహం అదేనా?

శనివారం, ఆదివారం ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాలలో అక్కడక్కడ వడగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని చాలా జిల్లాలలో రాత్రి పూట వేడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ రోజు ఎండలు ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల, నిర్మల్, మహబూబ్ నగర్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరినగర్, మెదక్ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. రాగల రెండు రోజులు తెలంగాణలో గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. శనివారం గరిష్టంగా ఆదిలాబాద్ లో 44.6, కనిష్టంగా హైదరాబాద్ లో 39.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. దీంతో బయటకు వెళ్లేవారు తగిన జాగ్రత్తలు తీసుకోకుండా బయటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ తెలిపింది.

Also Read: ఏ బొక్కలో దాక్కున్న తప్పించుకోలేరు.. ఉగ్రవాదుల వేటకు రంగంలోకి ధ్రువ్ హెలీకాప్టర్లు!


మరోవైపు రాత్రి సమయంలో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకుని సాయంత్రానికి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ రోజు తెలంగాణ లోని ఆదిలాబాద్, కొమరం భీమ్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.. ఉరుములు మెరుపులతో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

Also Read: సరిహద్దుల్లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఇండియాలోకి అక్రమంగా చొరబడేందుకు!

ఇక ఏపీలోను భిన్నమైన వాతావరణ పరిస్థితులకు అవకాశం ఉంది.శనివారం ఏపీలో తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. తీవ్రమైన ఎండలు, వడగాల్పుల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. శ్రీకాకుళం జిల్లా బూర్జ, హిరమండలం, లక్ష్మీనరసుపేట, పాతపట్నం, విజయనగరం జిల్లా సంతకవిటి, పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి, పాలకొండ మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీయనున్నాయి.. శ్రీకాకుళం-1, విజయనగరం-15, పార్వతీపురంమన్యం-9, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 2, తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉంది.. మరో 28 మండలాల్లో వడగాడ్పులు ప్రభావం కనిపించనుంది. ఆదివారం నాలుగు మండలాల్లో తీవ్ర, 17 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉంది. వేసవి అకాల వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఉరుములతో కూడిన అకాల వర్షాలు పటేడప్పుడు చెట్ల క్రింద నిలబడవద్దని సూచించింది.

Also Read: శ్రీనగర్‌లో చిక్కుకుపోయిన 80 మంది తెలంగాణ పర్యటకులు

Advertisment
Advertisment
Advertisment