/rtv/media/media_files/2025/03/10/rZwRKgT1zDfB38aWtrdX.jpg)
Assam to have its own satellite, talks with ISRO on
అస్సాం ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్ర అవసరాల కోసం సొంతంగా శాటిలైన్‌ను ఏర్పాటు చేసుకోనున్నట్లు తెలిపింది. సరిహద్దులపై నిఘా ఉంచడంతో సహా సామాజిక ఆర్థిక ప్రాజెక్టులు అమలు చేసేందుకు, అవసరమైన సమాచారాన్ని సేకరించేందుకు ఇది ఉపయోగపడుతుందని చెప్పింది. దీంతో దేశంలోనే సొంత శాటిలైట్ కలిగిన మొదటి దేశంగా అస్సాం నిలిచిపోనుంది. ''ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ అథరైజేషన్ సెంటర్ (INSPACe) సహకారంతో రాష్ట్రం కోసం ప్రత్యేకంగా ఉపగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలని భావిస్తున్నాం.
Also Read: పన్నులు తగ్గించాలని అడగొద్దు.. కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
కీలకమైన ప్రాజెక్టులు అమలు చేసేందుకు, అవసరమైన సమాచారాన్ని సేకరించేందుకు ఈ శాటిలైట్ ఎంతగానో దోహదపడుతుందని'' అస్సాం ఆర్థికశాఖ మంత్రి అజంతా నియాగ్ తెలిపారు. 2025-2026 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను తాజాగా ఆమె ప్రవేశపెట్టారు. వ్యవసాయం, విపత్తు నిర్వహణ, మౌలిక సదుపాయ అభివృద్ధి, సరిహద్దు నిర్వహణ, పోలీస్ ఆపరేషన్లలో శాటిలైట్ కీలక సేవలు అందిస్తుందని వివరించారు.
Also Read: రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో బిగ్‌ట్విస్ట్.. ప్రముఖ వ్యాపార వేత్త అరెస్ట్
మరోవైపు దీనిపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ కూడా మాట్లాడారు. '' రాష్ట్రానికి సొంతగా ఉపగ్రహం ఉంటే విదేశీయుల అక్రమ చొరబాట్లను అడ్డుకోవచ్చు. వాతావరణ రిపోర్టుల ద్వారా వరదలు, విపత్తు గురించి ముందుగానే తెలుసుకోవచ్చు. ఇటీవల ఉమ్రాంగ్సోలో బొగ్గుగనిలో ప్రమాదం జరిగింది. దానికి సంబంధించి శాటిలైట్ సమాచారాన్ని పొందేందుకు దాదాపు నెలన్నర సమయం పట్టింది. సొంతగా ఉపగ్రహం ఉన్నట్లయితే అది మన ప్రాంతంపైనే పూర్తిగా నిఘా ఉంచుతుంది. శాటిలైట్ ఏర్పాటుపై ఇప్పటికే ఇస్రోతో చర్చలు మొదలుపెట్టామని'' హిమంత బిశ్వ శర్మ అన్నారు.
Also Read: కొండచిలువతో స్కిప్పింగ్ ఆడుతున్న చిన్నారులు.. వీడియో చూశారా?
Also Read: H1B వీసా కోసం దరఖాస్తు చేసుకున్నవాళ్లకి బిగ్ షాక్.. రావడం కష్టమే