/rtv/media/media_files/2026/04/09/elections-2026-04-09-18-06-15.jpg)
Assam records 84.42% voting, Kerala and Puducherry show varied turnout till 5 PM
అసోం, కేరళ, పుదుచ్చేరిలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సాయంత్రం 5 గంటల వరకు అసోంలో 84.42 శాతం పోలింగ్ నమోదైంది. కేరళలో 75 శాతం పోలింగ్, పుదుచ్చేరిలో 86.92 శాతం పోలింగ్ నమోదైంది. క్యూ లైన్‌లో నిల్చున్నవారిని ఓటు వేసేందుకు అనుమతి ఇస్తున్నారు. మే 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.
అస్సాంలో గెలిచేదెవరు?
అస్సాంలో బీజేపీ-కాంగ్రెస్ కూటమి మధ్య గట్టి పోటీ ఉంది. సీఎం హిమంత బిశ్వ శర్మ నాయకత్వంలోని బీజేపీ కూటమి మూడోసారి గెలవాలని చూస్తోంది. ఇక 2016లో ఓడిపోయిన కాంగ్రెస్ ఈసారైన గెలవాలనే పట్టుదలతో ఉంది. ఈ ఎన్నికల్లో 99 స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దింపింది. ఇక్కడ మొత్తం 126 అసెంబ్లీ స్థానాలు ఉండగా 2.50 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు.
కేరళలో అధికారం మారనుందా ?
140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో అధికార LDF, విపక్ష UDF మధ్య ప్రధాన పోటీ నెలకొంది. 883 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. సీఎం పినరయ్ విజయన్ సారథ్యంలోని LDF వరుసగా మూడోసారి అధికారంపై కన్నేసింది. కానీ ప్రభుత్వ వ్యతిరేకత పెరిగిపోయిందని అందుకే ఈసారి అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ నేతృత్వంలోని UDF ఆశాభావం వ్యక్తం చేస్తోంది. రాష్ట్రంలో ఇప్పటిదాకా ఖాతా తెరవని బీజేపీ ఈసారి బలం పెంచుకోవాలని చూస్తోంది. అయితే పలు ప్రీపోల్ సర్వేలు ఈసారి UDF అధికారంలోకి వచ్చే అవకాశాలున్నట్లు అంచనా వేశాయి.
పుదుచ్చేరి అదిష్ఠానం ఎవరి సొంతం ?
కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి కేవలం 30 అసెంబ్లీ స్థానాలు మాత్రమే ఉన్నాయి. 294 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలోకి దిగారు. 9.5 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. అయితే ఈసారి అక్కడ రాష్ట్ర హోదా అంశం ప్రధానంగా మారింది. ఇక్కడ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉన్నాకూడా స్వతంత్ర పాలన లేదని కాంగ్రెస్-డీఎంకే విపక్ష కూటమి ఆరోపిస్తోంది. ఈసారి విపక్ష కూటమికి అవకాశం ఇస్తారో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే.
Follow Us