Delhi: ఢిల్లీలో పీక్స్‌కు చేరిన కాలుష్యం.. త్వరలో కృత్రిమ వర్షం !

ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు కృత్రిమ వర్షం కురిపించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పర్యావరణశాఖ మంత్రి గోపాల్ రాయ్‌ విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ఆయన మోదీ ప్రభుత్వానికి ఓ లేఖ రాసినట్లు మీడియాకు తెలిపారు.

New Update
pollu

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకి పెరిగిపోతోంది. దట్టమైన పొగమంచు వల్ల అక్కడ గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది. ఈ క్రమంలోనే వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు కృత్రిమ వర్షం కురిపించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పర్యావరణశాఖ మంత్రి గోపాల్ రాయ్‌ విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం ఆయన మోదీ ప్రభుత్వానికి ఓ లేఖ రాసినట్లు మీడియాకు తెలిపారు.  

Also Read: ఇంకా రాజధానిగా ఢిల్లీ అవసరమా..?

Artificial Rain

'' ఉత్తర భారత్‌ను పొగమంచు కప్పేస్తోంది. దీని నుంచి విముక్తి పొందాలంటే కృత్రిమ వర్షమే ఏకైక మార్గం. ఇది మెడికల్ ఎమర్జెన్సీ. ఈ విషయంలో ప్రధాని మోదీ జోక్యం చేసుకోవడం నైతిక బాధ్యత. కాలుష్యాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కృత్రిమ వర్షంపై కేంద్ర ప్రభుత్వానికి గత మూడు నెలలుగా లెటర్లు రాస్తున్నాను. కానీ వాళ్లు మాత్రం పట్టించుకోవడం లేదు. కృత్రిమ వర్షంపై కేంద్ర పర్యావరణశాఖ మంత్రి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ చర్యలు తీసుకోకపోతే మంత్రి పదవికి రాజీనామా చేయాలని'' గోపాల్ రాయ్ అన్నారు. 

Also Read: శబరిమలకు పోటెత్తిన స్వాములు..దర్శనానికి 10 గంటల సమయం!

ఇదిలాఉండగా మంగళవారం కూడా ఢిల్లీని పొగమంచు కమ్మేసింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 494కి పడిపోయింది. అలాగే చాలాప్రాంతాల్లో ఏక్యూఐ 500 మార్క్‌ను కూడా దాటిందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం వరుసగా రెండోరోజు ఆరెంజ్ అలర్ట్‌ కొనసాగుతోంది. పొగమంచు వల్ల రోడ్డుపై ఎదురుగా వస్తున్న వాహనాలు కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. దీనివల్ల పలు విమానాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం కొన్ని ఆలస్యంగా నడుస్తుండగా మరికొన్ని రద్దయిపోయాయి. ప్రయాణికులు తమ ప్రయాణాల కోసం అదనపు సమయం కేటాయించుకోవాలంటూ విమానసంస్థలు కూడా సూచనలు చేస్తున్నాయి.  

Also Read: కోలకత్తా నిందితుడిని తీసుకురావడంలో పోలీసుల కొత్త టెక్నిక్..

Also Read: మహారాష్ట్ర మాజీ హోంమంత్రి కారుపై రాళ్ళ దాడి..

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

భారీ వర్షం.. పిడుగులు పడి 13 మంది మృతి

బీహార్‌లో పలు జిల్లాల్లో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. బుధవారం ఉదయం నాలుగు జిల్లాల పరిధిలో పిడుగులు పడి 13 మంది ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. మృతుల కుటుంబాలకు సీఎం నితిశ్ కుమార్ రూ.4 లక్షల పరిహారం ప్రకటించారు.

New Update
13 killed in lightning strikes in four districts of Bihar

13 killed in lightning strikes in four districts of Bihar

బీహార్‌లో పలు జిల్లాల్లో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. బలమైన ఈదురు గాలులు వీచాయి. బుధవారం ఉదయం నాలుగు జిల్లాల పరిధిలో పిడుగులు పడి 13 మంది ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. దర్‌బంగా, బెగూసరాయ్ జిల్లాల్లో తొమ్మిది మంది పిడుగుపాటుకు గురై మృతి చెందారు. మధుబనీ జిల్లాలో ముగ్గురు చనిపోయారు. వీళ్లలో ఇద్దరూ ఒకే ఫ్యామిలీకి చెందిన తండ్రి, కూతురు. ఇక సమస్తిపుర్‌లో ఒక వ్యక్తి పిడుగుపాటు వల్ల మృతి చెందాడు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం అధికారికంగా వెల్లడించింది.    

Also Read: ముగ్గురు పిల్లల తల్లికి ఇంటర్ స్టూడెంట్‌తో మూడో పెళ్లి

ఈ ఘటనపై సీఎం నితీశ్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. విపత్తు నిర్వహణ అధికారులు జారీ చేసే సూచనలను పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అయితే బిహార్ ఆర్థిక సర్వే ప్రకారం చూసుకుంటే 2023లో పిడుగుపాటు వల్ల 275 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 Also read: పెళ్లికి ముందు కాబోయే అల్లుడితో అత్త జంప్‌..

ఇదిలాఉండగా భారత వాతావరణ శాఖ (IMD) కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్ 9 నుంచి 12వ తేదీ దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు చెప్పింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలుల విస్తాయని.. పలు ప్రాంతాల్లో పిడుగులు కూడా సంభవించే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.  

Also read: బీహార్ లో దారుణం కేంద్రమంత్రి మనమరాలి దారుణ హత్య

 

 

Advertisment
Advertisment
Advertisment