/rtv/media/media_files/2025/01/11/Za5pZYlkgAsaang8fsVM.jpg)
Anand Mahindra
దేశంలో ఊబకాయం సమస్యపై ఆందోళన వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ దీన్ని అధిగమించేందుకు చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.దీని పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు 10 మంది ప్రముఖులను నామినేట్ చేయగా..అందులో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కూడా ఒకరు.
Also Read: Horoscope Today:ఈ రోజు ఈ రాశి వారికి అన్ని శుభవార్తలే ..కానీ ..!
తన పేరు నామినేట్ చేయడం పై ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన మహీంద్రా...10 శాతం తక్కువ వంట నూనెను వినియోగించడం వంటి చిన్న చిన్న మార్పులతో ఒబెసిటీ పై పోరులో సత్ఫలితాలు సాధించవచ్చన్నారు.
ఆరోగ్యకరమైన జనాభా...
2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు..మనకు బలమైన ఆర్థిక వ్యవస్థ మాత్రమే కాదు, ఆరోగ్యకరమైన జనాభా కూడా అవసరం.వంట నూనె వినియోగాన్ని 10 శాతం తక్కువ చేయడం వంటి చిన్నపాటి మార్పులతో మంచి ఫలితాలు సాధించవచ్చు. అవి మన క్షేమం,డబ్బు, ఆదా, ఆరోగ్యకరమైన ప్రపంచం వంటివే కావొచ్చు అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.
ఈ క్రమంలోనే మరో 10 మందిని నామినేట్ చేశారు. నారా బ్రాహ్మణి, స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు, చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్, బాలీవుడ్ నటుడు అనిల్ కుమార్, మహిళా పారిశ్రామికవేత్త కిరణ్ మజుందార్ షా, గుల్ పనాగ్, నిఖిల్ కామత్, అనిశ్ షా, హేమంత్ సిక్కా, సుమన్ మిశ్రాలు ఈ జాబితాలో ఉన్నారు.
ఒబెసిటీ సమస్య గురించి ప్రధాని మోడీ ఆదివారం మన్ కీ బాత్ లో ప్రస్తావించారు. 2022 లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన గణాంకాల ప్రకారం...ప్రపంచ వ్యాప్తంగా 250 కోట్ల మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. ప్రతి ఎనిమిది మందిలో ఒకరు ఊబకాయం సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇది చాలా ఆందోళనకర అంశం.
ఊబకాయం అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. దీన్ని అధిగమించేందుకు మనమంతా కృషి చేయాలి.అది మన బాధ్యత కూడా..! తినే ఆహారంలో వంటనూనె వాడకాన్ని కనీసం పది శాతం మేర తగ్గించుకోవాలి అని ప్రధాని పిలుపునిచ్చారు.
Also Read: Cancer: భారత్‌లో ప్రతీ ఐదుగురిలో ముగ్గురు క్యాన్సర్‌తో మృతి.. సర్వేలో సంచలన విషయాలు