/rtv/media/media_files/2025/03/07/gYzzOnsSEXUAWv8Q76Td.jpg)
ranya rao father IPs Photograph: (ranya rao father IPs)
తప్పించుకోవడానికి ఎన్ని నాటకాలు ఆడాలో అన్నీ ఆడుతోంది బంగారం స్మగ్లింగ్ లో దొరికిపోయిన నటి రన్యారావు. విచారణ సమయంలో తనను చెంపపై కొట్టారని మొదట చెప్పిన ఆమె తర్వాత కోర్టులో మాత్రం కొట్టలేదని తన న్యాయవాది ద్వారా చెప్పించింది. మళ్ళీ తర్వాత తనే నన్ను అరెస్టు చేసినప్పటి నుంచి పదిహేను సార్ల వరకు చెంపదెబ్బలు కొట్టారని కూడా చెప్పింది అలాగే తన వద్ద పలుసార్లు తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకున్నారని ఆమె ఆరోపించింది. ఎంత కొట్టినా సంతకాలు చేయలేదని..కానీ చివరకు ఒత్తిడికి లొంగిపోయి.. టైప్ చేసిన 50-60 కాగితాలపై 40 తెల్ల కాగితాలపై బలవంతంగా సంతకాలు చేశానని రన్యారావు డీఆర్ఐ అధికారులకు చెప్పినట్లుగా తెలుస్తోంది. పోలీసులు చెప్పిన మాట వినకపోతే నా తండ్రిని ఇరికిస్తామని బెదిరించారు. దీనిలో ఆయనకు ఏమీ సంబంధం లేదని చెప్పింది. తనను నిర్బంధించిన తర్వాత 24 గంటల పాటు ఉద్దేశపూర్వకంగా నిద్ర, ఆహారం పెట్టలేదని..తనపై తప్పుడు కేసు పెట్టారని రన్యారావు మరోసారి చెప్పింది. తన నుంచి ఎటువంటి బంగారాన్ని స్వాధీనపరుచుకోలేదని.. ఢిల్లీ నుంచి వచ్చిన కొందరు వ్యక్తులు అధికారులుగా నటించారని..ఎవరినో రక్షించేందుకు తనకు ఇరికించారని ఓ కథ కూడా చెప్పిందని సమాచారం. ఇలా రకరకాల విషయాలను చెబుతూ ఢీఆర్ఐ అధికారులకు ఓ పెద్ద లేఖే రాసిందట రన్యారావు.
రన్యరావు తండ్రికి షాక్..
మరోవైపు రన్యారావు సవతి తండ్రి డీజీపీ రామచంద్రరావుకు కర్ణాటక ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఆయనను తప్పనిసరి లీవ్ పై పంపించింది. దీనికి కారణాలు మాత్రం ఎక్కడా చెప్పలేదు. అయితే రన్యారావు పట్టుబడడంపై సవతి తండ్రి రామచంద్రరావు మాత్రం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మీడియా ద్వారా తన నోటీసుకు వచ్చిందని, ఆమె ఇలాంటి పనులు చేస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదని అన్నారు. ఇంతకంటే మాట్లాడటానికి ఏమీ లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఆమె ఇప్పుడు తమ ఇంట్లో లేదని, భర్తతో కలిసి ఉంటోందని చెప్పారు.
ఇక రన్యారావు బెయిల్ పిటిషన్ ను ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు కూడా నిరాకరించింది. విదేశాల నుంచి బెంగళూరుకు బంగారం తరలించడానికి పోలీసు అధికారుల ‘ప్రోటోకాల్’ సేవలు రన్యారావు ఉపయోగించుకుందని డీఆర్ఐ కోర్టులో చెప్పింది. పోలీసులు, ప్రముఖల సహకారం, మద్దతుతోనే రన్యా రావు ఈ ఏడాది జనవరి నుంచి 27 సార్లు దుబాయ్‌కు వెళ్లి వచ్చిందని తెలిపారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి విశ్వనాథ్ సి.గౌడర్ ఆమెకు బెయిల్ ఇవ్వడాన్ని తిరస్కరించారు.
Also Read: USA: హెచ్ 1 బీ వీసాల రూల్స్ మళ్ళీ మార్పులు.. మరింత కఠినం !