/rtv/media/media_files/2025/03/14/z75K6jCdZDRfaTdkcJIP.jpg)
Golden Temple
పంజాబ్ లోని అమృత్ సర్ దేవాలయం చాలా ప్రసిద్ధి పొందినది. ఇక్కడకు నిత్యం భక్తులు వస్తూనే ఉంటారు. ఈరోజు ఆలయ కాంప్లెక్స్ లో అనుకోని సంఘటన చోటు చేసుకుంది. అక్కడ ఓ వ్యక్తి ఇనుప రాడ్డుతో విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే దాడి చేసిన వెంటనే ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పరిస్థితి వెంటనే అదుపులోకి తీసుకు వచ్చామని..స్వర్ణ దేవాలయం ప్రస్తుతం ప్రశాంతంగానే ఉందని చెప్పారు. భక్తులు, స్థానికులు ఉన్న కమ్యూనిటీ కిచెన్ లేదా గురురామ్‌దాస్ లంగర్ వద్ద దుండగుడు ఇనుపరాడ్డుతో దాడి చేయగానే అక్కడ తీవ్ర భయాందోళనలు వ్యక్తమయ్యాయి.
ఒకరి పరిస్థితి విషమం..
దాడిలో గాయపడిన వారిలో శిరోమణి గురుద్వారా ప్రబంధ్ కమిటీకి చెందిన ఇద్దరు వాలంటీర్లు ఉన్నారు. గాయపడిన ఐదుగురు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇందులో నలుగురి పరిస్థితి నిలకగా ఉండగా...ఒకరి పరిస్థితి మాత్రం సీరియస్ గా ఉందని వైద్యులు చెప్పారు. దాడికి పాల్పడిన వ్యక్తితో పాటు ఒక సహచరుడు కూడా ఉన్నాడు. దాడి జరిగిన వెంటనే వారిద్దరినీ స్థానికులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత పోలీసులు అరెస్ట్ చేశారు. దాడికి ముందు నిందితులు ఆ ప్రాంతంలో రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.
Alsso Read: HYD: హైదరాబాద్ లో దారుణం..హోలీ పేరుతో యాసిడ్ దాడి