/rtv/media/media_files/2025/02/17/hvqydrS3uZh00VOTyNw5.jpg)
fire accident in prayagraj Photograph: (fire accident in prayagraj)
ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాలో సోమవారం మధ్యాహ్నం మరోసారి భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ త్రివేణి సంగమంలోని సెక్టార్-8 ప్రాంతంలో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు.. యాత్రికులను అక్కడి నుంచి ఖాళీ చేయించారు. భక్తులు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలుస్తోంది.
VIDEO | Prayagraj: A fire broke out in a private camp at Sector 8 of Maha Kumbh Mela earlier today. Efforts are underway to douse the fire. More details waited.
— Press Trust of India (@PTI_News) February 17, 2025
(Source: Third Party)
(Full video available on PTI Videos- https://t.co/dv5TRARJn4) pic.twitter.com/SuBexVX3Ia
మహాకుంభ్‌లో 30 రోజుల వ్యవధిలోనే అగ్నిప్రమాదం జరగడం ఇది ఏడోసారి. జనవరి 19న మహా కుంభమేళాలో మొదటిసారిగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఎల్పీజీ సిలిండర్ పేలడంతో సెక్టార్ 19లో మంటలు చెలరేగి 18 గుడారాలు దగ్ధమైయ్యాయి. అదేనెల 25వ తేదీన మరోసారి అగ్నిప్రమాదం జరిగింది. సెక్టార్ 2 సమీపంలోని పార్కింగ్ ఏరియాలో మంటలు చెలరేగి పలు వాహనాలు కాలిపోయాయి.
Also Read : నేటి ఢిల్లీ భూకంపం.. రాబోయే ప్రళయానికి సంకేతమా..?
జనవరి 30న సెక్టర్ 22లో ఛత్నాగ్ ఝాన్సీ ప్రాంతంలో నిర్మించిన టెంట్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో డజనుకుపైగా టెంట్లు కాలిపోయాయి. ఆ తర్వాత ఫిబ్రవరి 7న శంకరాచార్య మార్గ్ లోని సెక్టార్ 18లో మంటలు చెలరేగాయి. ఫిబ్రవరి13, 15 తేదీల్లోనూ మహాకుంభమేళా ప్రాంతంలో అగ్నిప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఫైర్ యాక్సిడెంట్ సమయాల్లో అప్రమత్తమై అధికారులు వెంటనే చర్యలు తీసుకున్నారు. అదృష్టవశాత్తూ ఆయా ప్రమాదాల్లో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు.
Also Read : మోదీకి సంకెళ్లేసిన తమిళ మ్యాగజైన్‌పై నిషేధం