వంట చేయకూడదని దళిత మహిళకు అవమానం.. ఆరుగురికి జైలుశిక్ష

తమిళనాడులో 2018లో ఓ దళిత మహిళకు జరిగిన అవమానంపై ఎట్టకేలకు కోర్టు తీర్పునిచ్చింది. ఆ మహిళ వంట చేయకుండా అడ్డుకున్నందుకు ఆరుగురు గ్రామస్థులకు శుక్రవారం స్పెషల్ కోర్టు జైలుశిక్ష విధించింది.

New Update
6 sentenced for preventing Dalit cook from preparing food for schoolkids in Tamilnadu

6 sentenced for preventing Dalit cook from preparing food for schoolkids in Tamilnadu

తమిళనాడులో 2018లో ఓ దళిత మహిళకు జరిగిన అవమానంపై ఎట్టకేలకు కోర్టు తీర్పునిచ్చింది. ఆ మహిళ వంట చేయకుండా అడ్డుకున్నందుకు ఆరుగురు గ్రామస్థులకు శుక్రవారం స్పెషల్ కోర్టు జైలుశిక్ష విధించింది. కొన్నేళ్ల పాటు ఈ కేసు ఎస్సీ/ఎస్టీ చట్టం కింద కొనసాగింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. తిరుప్పూర్ జిల్లాలోని తిరుమలై గౌండమ్‌పాల్యంలో ఓ ప్రభుత్వ ఉన్న పాఠశాలలో పప్పాల్ అనే మహిళ వంటమనిషిగా చేరింది. 

Also Read: మావోయిస్టుల లొంగుబాటు, నెరవేరనున్న కేంద్రం లక్ష్యం.. ఇంక ఎంతమంది మిగిలారంటే?

ఆ స్కూల్‌లో పలువురు విద్యార్థులు తల్లిదండ్రులు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ పిల్లలకు ఆమె భోజనం వండకూడదంటూ వేధింపులకు గురిచేశారు. అప్పట్లో ఈ ఘటనపై తీవ్ర వివాదం చెలరేగింది. ఈ క్రమంలోనే తమిళనాడు అస్పృశ్యతా నిర్మూలన ఫ్రంట్ నిరసనలు చేపట్టింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఎస్సీ,ఎస్టీ చట్టం కింద 35 మందిపై కేసు నమోదు చేశారు. 

Also Read: ఎయిర్‌బస్‌ విమానాలకు సూర్యూడి ఎఫెక్ట్‌.. 6 వేల విమానాలకు అలెర్ట్

ఈ కేసుపై శుక్రవారం స్పెషల్ కోర్టులో విచారణ జరిగింది. ఇరువైపు వాదనలు విన్న కోర్టు చివరికి ఆరుగురు గ్రామస్థులకు రెండేళ్లు జైలుశిక్ష విధించింది. అలాగే రూ.5 వేల జరిమానా కూడా వేసింది. సరైన ఆధారాలు లేని కారణంగా మిగతా 25 మందిని నిర్దోషులుగా తేల్చింది. మరో నలుగురు విచారణ సమయంలోనే మృతి చెందారు. ఆరుగురు దోషులను పోలీసులు కోయంబత్తూర్ సెంట్రల్ జైలుకు తరలించారు. 

Advertisment
తాజా కథనాలు