/rtv/media/media_files/2024/12/24/9x0KRvT1KOufJnA7qs8L.jpg)
Kambhampati Haribabu
ఒడిశా, మిజోరంతో సహా మరో మూడు రాష్ట్రాల గవర్నర్లను బదిలీ, నియామకాలను చేసింది కేంద్రం. మిజోరం నూతన గవర్నర్‌గా ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ వీకే సింగ్; కేరళ గవర్నర్‌గా రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, ప్రస్తుతం కేరళ గవర్నర్‌గా ఉన్న ఆరిఫ్ మహ్మద్‌ఖాన్‌ను బిహార్ గవర్నర్‌గా నియమించారు. అలాగే, మణిపుర్ గవర్నర్‌గా కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లాను నియమించారు. అలాగే ప్రస్తుతం మిజోరం గవర్నర్‌గా ఉన్న కంభంపాటి హరిబాబును ఒడిశా గవర్నర్‌గా బదిలీ చేశారు. వీటికి సంబంధించిని ఉత్తర్వులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జారీ చేశారు.