/rtv/media/media_files/2025/03/19/rnM7fl0Q273GQsud4V4y.jpg)
4,549 people arrested in Stone pelting on Trains Cases, Says Ashwini Vaishnaw
ఈ మధ్యకాలంలో వందేభారత్ రైళ్లపై ఎక్కువగా రాళ్ల దాడి ఘటనలు జరిగిన సంగతి తెలిసిందే. అలాగే ఇతర రైళ్లపై కూడా ఇలాంటి దాడులు జరిగాయి. ఈ దాడులకు సంబంధించి కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక విషయం వెల్లడించారు. 2023 నుంచి 2025 ఫిబ్రవరి వరకు వందేభారత్‌తో పాటు ఇతర రైళ్లపై రాళ్ల దాడులు చేసినందుకు 7,971 కేసులు నమోదైనట్లు తెలిపారు.వీళ్లలో 4,549 మందిని అరెస్టు చేశామని పేర్కొన్నారు.
Also Read: జమ్మూ కశ్మీర్‌లో మిస్టరీ మరణాల కేసు.. ఆరోగ్యశాఖ కీలక ప్రకటన
రాళ్లదాడులపై అడిగిన ప్రశ్నలకు కేంద్రమంత్రి ఈ సమాధానం ఇచ్చారు. '' 2023 నుంచి 2025 ఫిబ్రవరి వరకు వందేభారత్‌తో పాటు వివిధ రైళ్లపై రాళ్ల దాడులు జరిగాయి. మొత్తం 7,971 రాళ్ల దాడులు ఘటనలు జరిగాయి. వీటికి పాల్పడినవారిలో ఇప్పటిదాకా 4,549 మందిని అరెస్టు చేశాం. రైళ్ల మరమ్మతు కోసం రూ.5.79 కోట్లు ఖర్చు చేశాం.
Also Read: వెల్ కమ్ బ్యాక్.. క్రూ9 అంటూ పీఎం మోదీ, సునీతాకు వెల్‌కమ్ చెప్పిన ఇస్రో ఛైర్మన్
ఇలాంటి తరహా ఘటనలు నియంత్రించేందుకు జీఆర్పీ, జిల్లా పోలీసులు, స్థానిక అధికారులతో కలిసి ఆర్ఫీఎఫ్ పనిచేస్తోంది. రాళ్ల దాడుల వల్ల కలిగే పర్యవసానాల గురించి తెలియజేస్తూ ట్రాకులకు దగ్గర్లో ఉన్న నివాస ప్రాంతాల్లో అవగాహన కల్పిస్తున్నాం. సంఘ వ్యతిరేక శక్తులపై చర్యలు తీసుకునేందుకు ఇప్పటికే గైడ్‌లైన్స్ కూడా జారీ చేశాం. అన్ని రాష్ట్రాల్లో భద్రతా కమిటీలు కూడా ఏర్పాటు చేశామని'' కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు.
Also Read: వెల్ కమ్ బ్యాక్.. క్రూ9 అంటూ పీఎం మోదీ, సునీతాకు వెల్‌కమ్ చెప్పిన ఇస్రో ఛైర్మన్
Also Read: దేశంలో అత్యంత సంపన్న ఎమ్మెల్యేగా బీజేపీ నేత.. ఆస్తులెంతంటే ?