Maoists: 15 రోజుల్లో 34 మంది మావోయిస్టులు మృతి.. దూకుడు పెంచుతున్న కేంద్రం

గత కొంతకాలంగా మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ ఏడాది జనవరిలో 15 రోజుల్లోనే ఏకంగా 34 మంది మావోయిస్టులు మృతి చెందారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్‌ను చదవండి.

New Update
Maoists

Maoists

Maoists: వామపక్ష తీవ్రవాదాన్ని అంతం చేస్తామని గతంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా(Amit Shah) ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల(Chhattisgarh Maoists)పై కేంద్ర భద్రతా బలగాలు దూకుడు పెంచుతున్నాయి. గత కొంతకాలంగా మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ ఏడాది జనవరిలో 15 రోజుల్లోనే ఏకంగా 34 మంది మావోయిస్టులు మృతి చెందారు.   

Also Read: ఆయుష్మాన్ భారత్ ఒప్పందం.. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు సుప్రీం కోర్టు విరామం

15 రోజుల్లోనే 34 మంది మావోయిస్టుల(Maoists) హతం.. 

అయితే జనవరి 6న బీజాపూర్ జిల్లాలో కుత్రు అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు వెళ్తున్న వాహనంలో మావోయిస్టులు బాంబు పెట్టి పేల్చివేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 8 మంది జవాన్లు, ఒక డ్రైవర్ మృతి చెందాడు. ఈ ఘటనతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి.  మావోయిస్టులను ఏరివేయడమే లక్ష్యంగా ఆపరేషన్‌ కగార్‌ను చేపట్టాయి. ఈ నెలలో 15 రోజుల్లోనే 34 మంది మావోయిస్టులు హతమయ్యారు. తాజాగా సుక్మా, బీజాపూర్, దంతేవాడ జిల్లాలకు చెందిన మావోయిస్టులు మృతి చెందారు. 

Also Read: పాకిస్థాన్​ మాజీ ప్రధాని​కి బిగ్ షాక్.. 14 ఏళ్లు జైలు శిక్ష

గురువారం తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో(Telangana Chhattisgarh Border) భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 19 మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో తెలంగాణ కేడర్‌కు చెందిన వారే ఉన్నట్లు సమాచారం. ఇదిలాఉండగా.. ఇటీవల మావోయిస్టులు పెట్టిన బాంబు దాడుల్లో కోబ్రా బెటాలియన్ కానిస్టేబుళ్లు మృదుల్ బర్మన్, మహ్మద్ ఇషాఖ్ గాయాలపాలయ్యారు. అయితే వీళ్లకు ప్రాణాపాయం తప్పిందని అధికారులు చెప్పారు. 

Also Read: నాగ సాధువులు రోజులో ఎంత తింటారు..ఎక్కడ ఉంటారు అంటే!

2004-14 మధ్య కాలంతో పోలిస్తే 2014-24 మధ్యకాలంలో నక్సల్స్‌ సంబంధిత ఘటనల్లో 53 శాతం తగ్గుదల నమోదైనట్లు గతంలో కేంద్రమంత్రి అమిత్ షా తెలిపారు. 2026 మార్చి నాటికి వామపక్ష తీవ్రవాదం నుంచి దేశాన్ని విముక్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు