/rtv/media/media_files/2025/03/27/ts8zIarr9vt9LQf3J648.jpg)
Union Minister Nitin Gadkari
కేంద్ర రవాణాశాఖ మంత్రి నితన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో 25 వేల కిలోమీటర్ల రహదారులను రెండు లేన్ల నుంచి నాలుగు లేన్లుగా మారుస్తామని వెల్లడించారు. మొత్తం రూ.10 లక్షల కోట్లతో ఈ ప్రాజెక్టు చేపడతామని పేర్కొన్నారు. దీనివల్ల దేశంలో రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గుతాయని లోక్‌సభలో ఆయన తెలిపారు. అలాగే రూ.6 లక్షల కోట్లతో 16 వేల కిలోమీటర్ల జాతీయ రహదారులను ఆరు లేన్లుగా మార్చుతామని స్పష్టం చేశారు.
Also Read: పోలీసులు కాదు రాక్షసులు.. పసివాడిపై థర్డ్ డిగ్రీ.. ప్రాణం పోయేలా కొట్టి!
'' దేశంలో 25 వేల కిలోమీటర్ల మేర జాతీయ రహదారులను రెండు లేన్ల నుంచి నాలుగు లేన్లుగా మార్చనున్నాం. రూ.10 లక్షల కోట్లతో ఈ ప్రాజెక్టు చేపట్టేందుకు ప్రణాళికలు రెడీ చేస్తున్నాం. దీనికి సంబంధించి డీపీఆర్‌లు కూడా సిద్ధమవుతున్నాయి. రెండేళ్లలో ఈ రోడ్ల పనులు పూర్తవుతాయని భావిస్తున్నాం. ఈ పనులు పూర్తయిన తర్వాత దేశంలో రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని'' నితిన్ గడ్కరీ అన్నారు.
Also Read: వినియోగదారులకు షాక్.. పెరిగిన పాల ధరలు.. ఎంతంటే ?
అంతేకాదు దేశంలో ప్రతీ సంవత్సరం 4.8 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ ప్రమాదాల్లో 18 నుంచి 45 ఏళ్ల వయసు ఉన్నవారు 1.88 లక్షల మంది చనిపోతున్నారని పేర్కొన్నారు. అలాగే ఈ రోడ్డు ప్రమాదాల వల్ల దేశ జీడీపీకి ప్రతీ సంవత్సరం 3 శాతం నష్టం వాటిల్లుతోందని తెలిపారు. 2030 నాటికి రోడ్డు ప్రమాదాల సంఖ్యను సగానికి తగ్గించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని గడ్కరీ అన్నారు.
Also Read: హిందీపై యోగి, స్టాలిన్ మధ్య మాటల యుద్ధం.. బ్లాక్ కామెడీ అంటూ!
Also Read: ఈసారి చార్‌ధామ్ యాత్రలో వీరికి నో ఎంట్రీ.. అలా చేస్తే వెనక్కి పంపిస్తామంటున్న అధికారులు
nitin-gadkari | roads | national-highways | national-news