/rtv/media/media_files/2025/03/27/6dgEsgDPOst2wnujLGZP.jpg)
2 militants killed, 5 policemen injured in gunbattle
జమ్మూకశ్మీర్‌లోని కథువా జిల్లాలో ఎన్‌కౌంటర్ జరిగింది. రాజ్‌బాగ్ సమీపంలోని ఘాటి జుథానాలో భద్రతా బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చాయి. ఈ కాల్పుల్లో మరో ఐదుగురు జవాన్లకు గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఇంకా ఎన్‌కౌంటర్ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ఆదివారం హిరానగర్ సెక్టార్‌లో యాంటి టెర్రరెస్టు ఆపరేషన్‌లో తప్పించుకున్న తీవ్రవాదులనే గురువారం భద్రత బలగాలు మట్టుబెట్టినట్లు తెలుస్తోంది. అయితే గత నాలుగు రోజులుగా ఈ ప్రాంతంలో ఉగ్రవాదుల ఎరివేత ఆపరేషన్ కొనసాగుతోంది.
Also Read: పోలీసులు కాదు రాక్షసులు.. పసివాడిపై థర్డ్ డిగ్రీ.. ప్రాణం పోయేలా కొట్టి!
ఇదిలాఉండగా గత నెలలో జమ్మూకశ్మీర్‌లోని అఖ్‌నూర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఐఈడీ బాంబు పేలడంతో ఇద్దరు ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ బాంబు దాడిని భారత సైనిక దళానికి చెందిన వైట్ నైట్ కార్ప్స్ నిర్ధరించింది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించింది.
Also Read: వినియోగదారులకు షాక్.. పెరిగిన పాల ధరలు.. ఎంతంటే ?
ఈ ఘటన తర్వాత మళ్లీ జమ్మూ కశ్మీర్‌లో ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు మరోసారి కాల్పులు జరిపారు. రాజౌరిలోని సుందర్‌బాని ప్రాంతంలో సైనికులు వాహనంపై వెళ్తుండగా ఉగ్రవాదులు ఈ దాడులకు పాల్పడ్డారు. మొత్తం నాలుగు రౌండ్లు వాహనంపై విచక్షణారహితంగా కాల్పులకు దిగారు. దీంతో సైనికులు వెంటనే అలర్ట్ అయ్యి ఎదురు కాల్పులకు దిగారు.
Also Read: హిందీపై యోగి, స్టాలిన్ మధ్య మాటల యుద్ధం.. బ్లాక్ కామెడీ అంటూ!
Also Read: ఈసారి చార్‌ధామ్ యాత్రలో వీరికి నో ఎంట్రీ.. అలా చేస్తే వెనక్కి పంపిస్తామంటున్న అధికారులు
rtv-news | terrorist | jammu-and-kashmir