Maharashtra : మాస్‌ కాపీయింగ్‌.. 17 మంది టీచర్లపై కేసు

పరీక్షల్లో కాపీయింగ్‌ను అరికట్టేందుకు అధికారులు పెట్టిన డ్రోన్ కెమెరా.. షాకింగ్ నిజాలను బయటపెట్టింది. చౌసాలాలోని ఒక పరీక్షా కేంద్రంలో పెద్ద ఎత్తున మాస్ కాపీయింగ్ జరుగుతుండగా డ్రోన్ విజువల్స్ ఆధారంగా అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

New Update
copying

మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో పదో తరగతి, ఇంటర్ పరీక్ష(exams) ల్లో కాపీయింగ్‌(copying) ను అరికట్టేందుకు అధికారులు పెట్టిన డ్రోన్ కెమెరా.. షాకింగ్ నిజాలను బయటపెట్టింది. చౌసాలాలోని ఒక పరీక్షా కేంద్రంలో పెద్ద ఎత్తున మాస్ కాపీయింగ్ జరుగుతుండగా డ్రోన్ విజువల్స్ ఆధారంగా అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఏకంగా 17 మంది ఉపాధ్యాయులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Also Read :  కేంద్రం సంచలనం.. 114 యుద్ధ విమానాలకు గ్రీన్ సిగ్నల్!

నిఘా కోసం డ్రోన్లను రంగంలోకి

మంగళవారం నుంచి మహారాష్ట్ర(maharashtra) స్టేట్ బోర్డ్ ఆధ్వర్యంలో 12వ తరగతి (HSC) పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షలు పారదర్శకంగా జరగాలని జిల్లా యంత్రాంగం నిఘా కోసం డ్రోన్లను రంగంలోకి దింపింది. చౌసాలాలోని 224వ నంబర్ సెంటర్‌లో డ్రోన్ కెమెరా తిరుగుతుండగా.. అక్కడి 16 పరీక్షా గదుల్లో విద్యార్థులు యథేచ్ఛగా కాపీ కొడుతున్న దృశ్యాలు రికార్డయ్యాయి. మరీ ఘోరమైన విషయం ఏమిటంటే, అక్కడ ఇన్విజిలేటర్లుగా ఉన్న ఉపాధ్యాయులే విద్యార్థులకు కాపీ కొట్టడంలో సాయం చేస్తూ కెమెరాకు చిక్కారు.

ఈ వ్యవహారంపై బీడ్ జిల్లా కలెక్టర్ వివేక్ జాన్సన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపీ రహిత పరీక్షల కోసం ప్రభుత్వం ఇంత ప్రయత్నం చేస్తుంటే, ఉపాధ్యాయులే ఇలా చేయడంపై ఆయన మండిపడ్డారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆ పరీక్షా కేంద్రం చీఫ్ కండక్టర్‌తో సహా మొత్తం 17 మంది టీచర్లపై నెకూర్ పోలీస్ స్టేషన్‌లో బుధవారం రాత్రి ఎఫ్ఐఆర్ (FIR) నమోదైంది. వీరిపై మహారాష్ట్ర యూనివర్సిటీలు, బోర్డుల మాల్ ప్రాక్టీస్ నిరోధక చట్టంతో పాటు భారతీయ న్యాయ సంహిత కింద కేసులు పెట్టారు.

బీడ్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 103 కేంద్రాల్లో దాదాపు 45 వేల మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాస్తున్నారు. ఒక్క బీడ్ జిల్లాలోనే కాదు, పక్కనే ఉన్న ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో కూడా ఇంగ్లీష్ పేపర్ జరుగుతున్నప్పుడు ఇలాగే మాస్ కాపీయింగ్ బయటపడింది. అక్కడ కూడా ఇన్విజిలేటర్లతో సహా మొత్తం 23 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే ఎంతటి వారైనా వదిలేది లేదని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Also Read :  మోడీ ఫ్రెండ్స్ కోసమే ఒప్పందం.. ఇండియాకు నష్టాలేనన్న రాహుల్ గాంధీ

Advertisment
తాజా కథనాలు