BIG BREAKING: నీట్‌ పేపర్ మళ్లీ లీక్ !

మెడికల్ విద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ యూజీ ప్రవేశపరీక్ష-2026 మరోసారి లీక్ అవ్వడం కలకలం రేపుతోంది. ఈ పరీక్ష నిర్వహించే ముందు రాజస్థాన్‌లో పంపిణీ చేసిన మెటీరియల్.. నీట్‌ పేపర్‌లోని 600 మార్కుల ప్రశ్నలతో పోలిఉంది.

New Update
NEET Paper Leak

NEET Paper Leak

మెడికల్ విద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ యూజీ ప్రవేశపరీక్ష-2026 మరోసారి లీక్ అవ్వడం కలకలం రేపుతోంది. ఈ పరీక్ష నిర్వహించే ముందు రాజస్థాన్‌లో పంపిణీ చేసిన మెటీరియల్.. నీట్‌ పేపర్‌లోని 600 మార్కుల ప్రశ్నలతో పోలిఉంది. ఈ వ్యవహారంపై రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్‌ విచారణ చేపట్టింది.  మే 3న జరిగిన పరీక్షలోని వచ్చిన క్వశ్చన్స్‌ను పోలి ఉన్న సమారు 140 ప్రశ్నలతో ఓ పాక్టీస్ పేపర్‌ను అధికారులు గుర్తించారు. 

 ఈ మెటీరియల్‌ రాజస్థాన్‌లోని సికార్‌లో పరీక్షకు రెండ్రోజుల ముందుగానే వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీన్ని విద్యార్థులకు రూ.20వేల నుంచి రూ.2 లక్షల వరకు విక్రయించినట్లు గుర్తించామని చెప్పారు. ఈ ప్రశ్నలు యాదృచ్ఛికంగా అలా వచ్చాయా ? లేదా ఎవరైనా పేపర్ లీక్ చేశారా అనేదానిపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అంతేకాదు పలు క్వశ్చన్లలో జవాబుల క్రమం కూడా ఒకేలా ఉంది. ఆ ప్రాక్టీస్ పేపర్ కేరళలో ఓ మెడికల్ కాలీజేలో చదువుతున్న MBBS విద్యార్థికి చెందిందని విచారణలో తేలిందని అధికారులు చెప్పారు. 

మే1న అతడు సికార్‌ ప్రాంతంలోని తన స్నేహితుడికి ఈ మెటిరియల్ ఇచ్చాడని.. ఆ తర్వాత ఇది పీజీ హస్టల్స్, కోచింగ్ నెట్‌వర్క్‌లు, పరీక్షలకు రెడీ అవుతున్న అభ్యర్థులకు చేరినట్లు చెప్పారు. అయితే ఈ మెటీరియల్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీకి చెందిన 300లకు పైగా చేతిరాత ప్రశ్నలు ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై జాతీయ పరీక్ష సంస్థ (NTA) కూడా స్పందించింది. పరీక్ష జరిగిన నాలుగు రోజుల తర్వాత తమకు ఈ సమాచారం అందినట్లు తెలిపింది. ఈ వివరాలను సంబంధిత ఏజెన్సీలకు అందించామని చెప్పింది. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు జరుగుతున్నట్లు పేర్కొంది.  

ఇదిలాఉండగా 2024 మే నెలలో జరిగిన నీట్‌ పరీక్ష పేపర్ కూడా లీక్ అయినట్లు ఆరోపణలు వచ్చాయి. బిహార్‌, గుజరాత్‌ లాంటి రాష్ట్రాల్లో పరీక్షకు ముందే కొందరు విద్యార్థులకు ప్రశ్నపత్రాలు చేరినట్లు తెలిసింది. అంతేకాదు పరీక్ష ఫలితాల్లో కూడా ఏకంగా 67 మంది విద్యార్థులకు 720కి 720 మార్కులు రావడం అనుమానాలకు దారితీసింది. దీంతో పరీక్షను మళ్లీ నిర్వహించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం.. పేపర్ లీక్ అనేది పాట్నా,హజారీబాగ్ లాంటి కొన్ని ప్రాంతాలకే పరిమితమైందని.. పరీక్ష వ్యవస్థ మొత్తం పాడైపోలేదని స్పష్టం చేసింది. 

Advertisment
తాజా కథనాలు