/rtv/media/media_files/2025/04/09/BcT4JqxTgRNgWRAGs6vx.jpg)
13 killed in lightning strikes in four districts of Bihar
బీహార్‌లో పలు జిల్లాల్లో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. బలమైన ఈదురు గాలులు వీచాయి. బుధవారం ఉదయం నాలుగు జిల్లాల పరిధిలో పిడుగులు పడి 13 మంది ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. దర్‌బంగా, బెగూసరాయ్ జిల్లాల్లో తొమ్మిది మంది పిడుగుపాటుకు గురై మృతి చెందారు. మధుబనీ జిల్లాలో ముగ్గురు చనిపోయారు. వీళ్లలో ఇద్దరూ ఒకే ఫ్యామిలీకి చెందిన తండ్రి, కూతురు. ఇక సమస్తిపుర్‌లో ఒక వ్యక్తి పిడుగుపాటు వల్ల మృతి చెందాడు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం అధికారికంగా వెల్లడించింది.
Also Read: ముగ్గురు పిల్లల తల్లికి ఇంటర్ స్టూడెంట్‌తో మూడో పెళ్లి
ఈ ఘటనపై సీఎం నితీశ్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. విపత్తు నిర్వహణ అధికారులు జారీ చేసే సూచనలను పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అయితే బిహార్ ఆర్థిక సర్వే ప్రకారం చూసుకుంటే 2023లో పిడుగుపాటు వల్ల 275 మంది ప్రాణాలు కోల్పోయారు.
Also read: పెళ్లికి ముందు కాబోయే అల్లుడితో అత్త జంప్..
ఇదిలాఉండగా భారత వాతావరణ శాఖ (IMD) కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్ 9 నుంచి 12వ తేదీ దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు చెప్పింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలుల విస్తాయని.. పలు ప్రాంతాల్లో పిడుగులు కూడా సంభవించే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
Also read: బీహార్ లో దారుణం కేంద్రమంత్రి మనమరాలి దారుణ హత్య