Illegal Indian Immigrants: ఇండియాకు చేరుకున్న 12 మంది అమెరికా అక్రమవలసదారులు

అమెరికా నాలుగో విడత అక్రమవలసదారులను ఇండియా పంపించింది. పనామా నుంచి 12 మంది ఆదివారం ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్నారు. వారిలో నలుగురు పంజాబ్, ముగ్గురు చొప్పున హర్యానా, ఉత్తరప్రదేశ్‌ వాసులున్నారు. 300 మంది అక్రమ వలసదారుల్ని పనామాలో ఓ హోటల్‌లో ఉంచారు.

New Update
us immigrants

us immigrants Photograph: (us immigrants)

Illegal Indian Immigrants: అమెరికా బహిష్కరించిన 12 మంది భారతీయులు ఆదివారం ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్నారు. అమెరికా అక్రమవలసదారులను భారత్‌కు ఇది నాలుగో సారి. ఈ 12 మందిని పనామా నుంచే ప్రత్యేక విమానాల్లో ఇండియాకు తరలించారని అధికారులు తెలిపారు. 12 మందిలో నలుగురు పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు తిరిగి వెళ్లారని అధికారులు తెలియజేశారు. హర్యాణా, ఉత్తరప్రదేశ్‌కు చెందిన చెరో ముగ్గురు ఇందులో ఉన్నారు. ఫిబ్రవరి 5న మొదటి రౌండ్ బహిష్కరణలో ఒక అమెరికన్ సైనిక విమానం 104 మంది భారతీయులను అమృత్‌సర్‌కు తరలించిన విషయం తెలిసిందే. 

Also Read: దేశ విభజన తర్వాత పాక్‌తో ఫస్ట్ టైం బంగ్లాదేశ్ వ్యాపారం

అమెరికా భారతీయ వాలసదారులపై అవలంభిస్తున్న విధానాలపై దేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఆదివారం మాట్లాడారు. బహిష్కరించబడిన వారి పట్ల దుర్వినియోగం జరగకుండా చూసుకోవడానికి కేంద్రం అమెరికాతో చర్చలు జరుపుతోందని ఆయన అన్నారు. అక్రమ వలసదారులను అమెరికా స్వదేశాలకు పంపిండం కొత్తే కాదని, ఇది చాలా సంవత్సరాలుగా జరుగుతోందని చెప్పుకొచ్చారు.

వివిధ దేశాలకు చెందిన 300 మంది వలసదారులను పనామాలోని ఒక హోటల్‌లో ఉంచారు. అధికారులు వారిని వారి స్వదేశాలకు తిరిగి పంపడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం పనామాలో ఉన్న 300మంది అక్రమ వలసదారులలో, 171 మంది మాత్రమే తమ స్వదేశాలకు తిరిగి రావడానికి అంగీకరించారు. మిగిలిన వారిని అమెరికా బలవంతంగా పంపిస్తోంది. అమెరికాలో అక్రమవలసదాలను పంపించడానికి పనామా, కోస్టారికాతో పని చేస్తోంది అగ్రరాజ్యం.

Also Read: మైనర్‌ బాలికలు శృంగారం చేస్తే తప్పుకాదు.. హైకోర్టు సంచలన వ్యాఖ్యలు!

Advertisment
Advertisment
Advertisment