West Bengal: 15 ఏళ్ల దీదీ పాలనకు ముగింపు.. బీజేపీకి విజయానికి దారితీసిన 10 ప్రధాన కారణాలు ఇవే !

టీఎంసీ పార్టీ వరుసగా మూడుసార్లు అధికారంలోకి వచ్చింది. కానీ ఈసారి మాత్రం బీజేపీ తన బలాన్ని నిరూపించుకుంది. ఈ ఎన్నికల్లో టీఎంసీని అధికారం నుంచి తప్పింది.. బీజేపీ విజయానికి కారణమైన పలు కీలక అంశాలు తెలుసుకుందాం. 

New Update
10 reasons behind BJP victory in West bengal

10 reasons behind BJP victory in West bengal

పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల్లో బీజీపీ ప్రభంజనం సృష్టిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ దాటేసి 199 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక మూడుసార్లు అధికారంలోకి వచ్చిన టీఎంసీ పార్టీ ఈసారి 88 స్థానాల్లోనే లీడింగ్‌లో ఉంది. మొత్తానికి ఈసారి పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. 2011 ఎన్నికల్లో కూడా బీజేపీ.. టీఎంసీకి గట్టి పోటీ ఇచ్చింది. కానీ చివరికి తుది ఫలితాలు టీఎంసీకి అనుకూలంగా వచ్చాయి. ఆ ఎన్నికల్లో టీఎంసీ 177 స్థానాల్లో గెలిచి అధికారంలోకి రాగా.. బీజేపీ 77 స్థానాల్లో గెలిచి  రాష్ట్రంలో ప్రధాన విపక్ష పార్టీగా అవతరించింది. ఆ తర్వాత 2016, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వరుసగా టీఎంసీ అధికారంలోకి వచ్చింది. కానీ ఈసారి మాత్రం బీజేపీ తన బలాన్ని నిరూపించుకుంది. ఈ ఎన్నికల్లో టీఎంసీని అధికారం నుంచి దించి.. బీజేపీ విజయానికి కారణమైన పలు కీలక అంశాలు తెలుసుకుందాం. 

1. ప్రభుత్వ వ్యతిరేకత
2011లో పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలో వామపక్ష పార్టీల కంచుకోటను కూల్చివేసిన దీదీ చరిత్ర సృష్టించారు. అయితే టీఎంసీ 15 ఏళ్లుగా అధికారంలో ఉంది. ఫలితంగా మమతా బెనర్జీ ప్రభుత్వం వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. 

2. BJPకి పెరుగుతున్న సపోర్ట్
గత పదేళ్లలో బీజేపీ ఒక చిన్న పార్టీ నుంచి బలమైన విపక్ష పార్టీగా మారింది. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 10 శాతం ఓట్లను సాధించగా, 2021 ఎన్నికలలో ఈ వాటా 38 శాతానికి పెరిగింది. ఇలా వరుసగా బీజేపీ తన ఓటింగ్ శాతాన్ని పెంచుకుంటూ వస్తోంది. 

3. TMCపై అసంతృప్తి
పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ ప్రజాదరణ పొందిన బలమైన నాయకురాలిగా ఉన్నారు. కానీ నిరుద్యోగం, అవినీతి లాంటి అంశాలను పట్టుకొని బీజేపీ మమతా ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది. టీఎంసీకి బీజేపీ నిలదీస్తుండటంతో ఓటర్లు ప్రత్యామ్నాయ పార్టీగా బీజేపీ వైపు చూశారు. 

4.అవినీతిపై ఆగ్రహం
గత కొన్నేళ్లుగా టీఎంసీ సర్కార్ స్కాముల్లో ఇరుక్కుంది. ఇందులో పాఠశాల ఉపాధ్యాయుల నియామకాల కుంభకోణం, రేషన్ కుంభకోణం లాంటివి ఉన్నాయి. వీటిపై కేంద్ర దర్యాప్తు సంస్థలు సైతం దర్యాప్తు చేశాయి. మాజీ మంత్రి పార్థ చటర్జీ లాంటి పలువురు ప్రముఖ నేతలు అరెస్టు కావడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీసింది

5. మహిళల భద్రత సమస్య
ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో మహిళా వైద్యురాలిపై అత్యాచార ఘటన దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటన తర్వాత టీఎంసీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. అలాగే సందేశ్‌ఖాలి ఘటన  కూడా టీఎంసీ ప్రతిష్టను దిగజార్చింది.ఈ అంశాలు బీజేపీకి ప్లస్ పాయింట్లుగా మారాయి. 

6 .చొరబాటుదారులు టార్గెట్
పశ్చిమ బెంగాల్‌లో బంగ్లాదేశీయుల చొరబాటు సమస్య ఎన్నోఏళ్లుగా కొనసాగుతోంది. టీఎంసీ ప్రభుత్వం చొరబాటుదారుల పట్ల సానుభూతి చూపిస్తోందని, వారి వల్లే వరుసగా గెలుస్తోందని బీజేపీ ఆరోపణలు చేస్తూ వస్తోంది. తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో చొరబాటు సమస్యను పరిష్కరిస్తామంటూ బీజేపీ కూడా హామీ ఇచ్చింది.

7 . SIRతో ప్రయోజనం
పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు ముందు, ఓటర్ల జాబితాను సవరించడానికి SIRను చేపట్టిన సంగతి తెలిసిందే. దీనివల్ల రాష్ట్రంలో దాదాపు 91 లక్షల ఓట్లను తొలగించారు. ఇది టీఎంసీకి దెబ్బ కొట్టినట్లయ్యింది. 

8.హిందూ ఓట్ బ్యాంక్
ఈ పశ్చిమ బెంగాల్‌లో హిందూ ఓటర్లను సమీకరించడానికి బీజేపీ చాలా ప్రయత్నాలు చేసింది. టీఎంసీ ముస్లింలకు సానుభూతి చూపిస్తోందని.. దాన్ని బీజేపీ మాత్రమే ఆపగలదని కమలం పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ప్రధాని మోదీ, అమిత్ షా, రాష్ట్రంలోని ప్రముఖ బీజేపీ నాయకుడు సువేందు అధికారి సహా పలువురు ప్రముఖ బీజేపీ నేతలు టీఎంసీ వ్యతిరేకంగా బలంగా ప్రచారం చేయగలిగారు. హిందూ ఓటర్ల పట్ల మమతా బెనర్జీ ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని బహిరంగంగా ఆరోపించారు.

9. కలిసొచ్చిన మోదీ ఇమేజ్‌
ప్రధాని మోదీకి దేశవ్యాప్తంగా తనకంటూ ఓ ప్రత్యేక క్రేజ్‌ను సొంతం చేసుకున్నారు. ఇటీవల జరిగిన మహారాష్ట్ర, హర్యానా లాంటి రాష్ట్రాల్లో కూడా బలంగా ప్రచారం చేసి బీజేపీని గెలిపించారు. ఆపరేషన్ సిందూర్‌ తర్వాత మోదీ ఇమేజ్‌ మరింత పెరిగింది. దీంతో ఈ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌ ప్రజలు మోదీ వైపు మొగ్గుచూపారు. 

10. మహిళకు ఆర్థిక సాయం
పశ్చిమ బెంగాల్‌లో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే రాష్ట్ర పరిస్థితులు మారుతాయని బీజేపీ హామీ ఇచ్చింది. ప్రత్యేకంగా మహిళా ఓటర్లను టార్గెట్ చేసుకుని.. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మహిళల బ్యాంకు ఖాతాల్లోకి ప్రతి నెలా రూ.3,000 నేరుగా వస్తాయని హామీ ఇచ్చింది. దీంతో మహిళలకు కూడా ఈ స్కీమ్‌ను స్వాగతించి బీజేపీకే ఓట్లు వేశారు. 

Advertisment
తాజా కథనాలు