/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Untitled-design-44.png)
మణిపూర్ (Manipur) కోసం ప్రధాని మోదీ ఏం చేశారని రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రశ్నించారు.బీజేపీ (BJP) భావజాలమే మణిపూర్‌లో (Manipur) మంటలకు కారణమైందని ఇదంతా మోదీకి (Modi) తెలుసని వ్యాఖ్యానించారు.జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపుర్‌లో విపక్ష కూటమి 'ఇండియా' ఎంపీలు (INDIA MP's) ఈనెల 29,30 తేదీల్లో పర్యటించనున్నారు. 20 మంది ఎంపీలతో కూడిన ప్రతినిధుల బృందం మణిపూర్‌లో పర్యటించి అక్కడి పరిస్థితి తెలుసుకోనుందని కాంగ్రెస్ నేతలు (Congress Leaders) వెల్లడించారు. గతంలోనూ ప్రతిపక్ష పార్టీల ఎంపీలు మణిపూర్‌ను సందర్శించాలని భావించినా అక్కడ నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా వారికి అనుమతి లభించలేదన్నారు. రాహుల్ గాంధీ మాత్రం మణిపూర్‌లో కొన్ని ప్రాంతాల్లో పర్యటించారు.విపక్ష కూటమి ఇండియాలో మొత్తం 26 పార్టీలు (26 Parties) ఉన్నాయి.మణిపుర్ అంశంపై ప్రధాని మోదీ పార్లమెంట్‌లో ప్రకటన చేయాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి.ఇప్పటికే మోదీ సర్కారుపై కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగొయ్ (MP Gourav Gogoi) అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా లోక్‌సభ స్పీకర్ (Lok Sabha Speaker) ఓంబిర్లా దానికి అనుమతి ఇచ్చారు.
మోదీ ఆర్‌ఎస్‌ఎస్ వర్గాలకే ప్రధాని
నరేంద్ర మోదీ దేశానికి ప్రధాని కాదని కొంతమంది ఆర్ఎస్ఎస్ (RSS) వర్గాలకు మాత్రమే పనిచేస్తున్నారంటూ రాహుల్ గాంధీ విమర్శించారు.తమ భావజాలమే మణిపూర్‌ను ఈ దుస్థితికి తీసుకొచ్చిందన్న విషయం ప్రధాని మోదీకి తెలుసన్నారు.విపక్ష కూటమి తమ పేరును ఇండియాగా పెట్టుకుంటే మోదీ ఏకంగా దేశాన్నే అవమానిస్తున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ విద్వేష దుకాణాన్ని తెరిచిన ప్రతిచోట కాంగ్రెస్ కార్యకర్తలు ప్రేమ అంగళ్లను తెరవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.బీజేపీ-ఆర్ఎస్ఎస్ అధికారం కోసం ఏమైనా చేస్తాయి.అధికారం కోసం మణిపుర్‌నే కాదు దేశం మొత్తాన్ని మంటల్లో నెట్టేసి యావద్దేశాన్ని అమ్మేస్తారంటూ రాహుల్ ఫైర్ (Rahul Fire) అయ్యారు.దేశ ప్రజల బాధల గురించి వారు పట్టించుకోరు.దేశభక్తి ఉన్న ఎవరికైనా పౌరుల బాధలు తెలుస్తాయి.కానీ బీజేపీ-ఆర్ఎస్ఎస్‌కు ఆ బాధ తెలియదన్నారు. ఎందుకంటే దేశాన్ని విభజించేందుకు వారు ఈ కుట్రకు ప్రయత్నిస్తున్నారన్నారు.ప్రస్తుతం బీజేపీ-ఆర్ఎస్ఎస్‌కు,కాంగ్రెస్‌కు మధ్య భావజాల యుద్ధం జరుగుతోందని రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
రాజ్యసభలో విపక్ష ఎంపీలు వాకౌట్
#WATCH | NDA MPs chant "Modi, Modi" in Rajya Sabha as EAM Dr S Jaishankar makes a statement on the latest developments in India's Foreign Policy. To counter this, INDIA alliance MPs chant "INDIA, INDIA." pic.twitter.com/REJgfm50h2
— ANI (@ANI) July 27, 2023
మణిపూర్ అంశంపై చర్చించాలని కోరుతూ రాజ్యసభలో(Rajya Sabha) విపక్ష ఎంపీలు వాకౌట్ (Walk out) చేశారు.అధికార,విపక్ష సభ్యుల నినాదాలతో మధ్యాహ్న భోజన విరామానికి (Lunch Break) ముందే రెండుసార్లు సభ వాయిదా పడింది.తిరిగి సమావేశమైన తర్వాత కేంద్ర సమాచార,ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ (Anurag Takore) 2023 సినిమాటోగ్రఫీ సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టారు.దీనిపై మాట్లాడేందుకు విపక్షనేత మల్లికార్జున ఖర్గేకు (Mallikarjuna Khargey) సభాపతి అనుమతి ఇచ్చారు.అయితే తాను బిల్లు గురించే కాకుండా మనసులో మాట కూడా చెబుతానని ఖర్గే మణిపూర్ అంశాన్ని ప్రస్తావించారు.దీనికి సభాపతి అనుమతించలేదు.బిల్లువరకే పరిమితం కావాలని సూచించారు. దీంతో కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారు. అటు లోక్‌సభలోనూ వాయిదాల పర్వమే కొనసాగింది.కేంద్రమంత్రి జైశంకర్ (Jaishankar) ప్రకటనకు కొందరు అడ్డు తగలడం ప్రభుత్వ, విపక్ష ఎంపీల మధ్య కొంత వాగ్వాదానికి దారితీసింది.
Mohan Bhagwat: 'పాకిస్తాన్ తప్పు చేసింది'.. ఉగ్రదాడిపై RSS చీఫ్ సంచలన వ్యాఖ్యలు
జమ్మూకశ్మీర్‌లో జరిగిన పహల్గాం ఉగ్రదాడిపై ఆర్ఎస్ఎస్ చీఫ్.. మోహన్ భగవత్ స్పందించారు. తప్పు చేసిన వాళ్లని శిక్షించాలాని భగవద్గీత చెబుతోందని అన్నారు. పాకిస్థాన్ తప్పు చేసింది కాబట్టి తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందేనని పేర్కొన్నారు.
Mohan Bhagwat
జమ్మూకశ్మీర్‌లో జరిగిన పహల్గాం ఉగ్రదాడిపై ఆర్ఎస్ఎస్ చీఫ్.. మోహన్ భగవత్ స్పందించారు. శనివారం ఢిల్లీలో నిర్వహించిన ఓ పుస్తకావిష్కరణ సభలో ఆయన మాట్లాడారు. '' పొరుగు దేశాలతో తమకు గొడవలు, యుద్ధం అవసరం లేదు. శాశ్వత శాంతి కోసమే ఇన్నాళ్లు మౌనంగా ఉన్నాం. కానీ వాళ్లు ఉగ్రదాడులు చేస్తూ అమాయకులను బలి తీసుకుంటున్నారు. ఇప్పుడు దాడులతో సంబంధం లేదని చెబుతున్నారు. తప్పు చేసిన వాళ్లని శిక్షించాలాని భగవద్గీత చెబుతోంది. పాకిస్థాన్ తప్పు చేసింది. కాబట్టి తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందే.
Also Read: భారత్-పాకిస్థాన్ యుద్ధం డేట్ ఫిక్స్..! పాక్ మాజీ హైకమిషనర్ సంచలన కామెంట్స్
ఆరోజు రాముడు కూడా.. రావణాసురుడిని రాజ్య ప్రజల సంక్షేమం కోసం మాత్రమే చంపారు. కానీ అది హింస కాదు. ఎవరైనా మాత్రం తప్పుడు మార్గాన్ని ఎంచుకుంటే అది తప్పు అని చెప్పి.. సరైన మార్గంలో నడిపించడమే రాజు బాధ్యత. ఇప్పుడు రాజు తాను చేయాల్సిన పని చేసుకుంటూ పోతాడని'' మోహన్ భగవత్ అన్నారు.
Also Read: వామ్మో.. ఆ రాష్ట్రంలో 5వేల మంది పాకిస్థానీయులు..
అలాగే ఈ దాడి దేశ ప్రజలను ఎంతో వేదనకు గురిచేసిందని.. ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదని అన్నారు. తిరిగి చెల్లించాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. మనకు బలం లేకపోతో వేరే మార్గాన్ని ఎంచుకునే వాళ్లమని.. ఇప్పుడు మనం బలవంతులం కాబట్టి తప్పకుంటా మన బలమేంటో చూపించాలని మోహన్ భగవత్ అన్నారు.
Also Read: అంతా మారిపోయింది.. వాళ్లు రాజకీయాల్లోకి రావాలి: రాహుల్ గాంధీ
Also Read: మీకు దండం పెడతా.. పిల్లలకు గుండె ఆపరేషన్లు ఉన్నాయి.. పాకిస్థానీ తండ్రి ఆవేదన!
mohan-bhagwat | attack in Pahalgam
Andhra Pradesh: వారికి రూ.8 లక్షలు.. సీఎం చంద్రబాబు అదిరిపోయే గుడ్ న్యూస్
భర్త మెచ్చిన అర్ధాంగిలో ఉండాల్సిన లక్షణాలివే!
🔴India - Pakistan War Live Updates: ఏ క్షణమైనా భారత్ -పాకిస్థాన్ యుద్ధం లైవ్ అప్డేట్స్!
Omar Abdullah: పాక్ ప్రధానిపై ఒమర్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
KKR Vs PBKS: కేకేఆర్‌కు బిగ్ షాక్.. పంజాబ్ కింగ్స్ భారీ టార్గెట్..