Jammu-Kashmir: జమ్మూకశ్మీర్ ఎన్నికలు..కాంగ్రెస్–ఎన్‌సీ ఒప్పందం మరి కొన్ని రోజుల్లో జమ్మూకశ్మీర్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీల మధ్య సీట్ల ఒప్పందం కుదిరింది. 32 చోట్ల కాంగ్రెస్, 51 స్థానాల్లో ఎన్‌సీ పోటీ చేయనున్నాయి. ఇక్కడ సెప్టెంబర్ 18 నుంచి మూడు విడతల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. By Manogna alamuru 26 Aug 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Congress- NC : జమ్మూ–కశ్మీర్ ఓ జరిగే ఎన్నికల మొదటి విడత నామినేషన్ల దాఖలు ప్రక్రియ ఈరోజుతో ముగుస్తోంది. ఇక్కడ పలు పార్టీలు పోటీ చేయనున్నాయి. వాటిల్లో ఇండియా కూటమి పార్టీలు కూడా ఉన్నాయి. వీటిల్లో జమ్మూ–కశ్మీర్‌లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయి. దీనిపై ఈరోజు రెండు పార్టీలు ఒక ఒప్పందానికి వచ్చాయి. జమ్మూకశ్మీర్‌లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా ఒప్పందం ప్రకారం.. 32 చోట్ల కాంగ్రెస్, 51 స్థానాల్లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ పోటీ చేయనున్నాయి. ఈ విషయాన్ని జమ్మూకశ్మీర్ యూనిట్ కాంగ్రెస్ చీఫ్ తారిఖ్ హమీద్ కర్రా తెలిపారు. మిగతా ఐదు స్థానాల్లో కాగ్రెస్, ఎన్‌సీల మధ్య స్నేహపూర్వక పోటీ ఉంటుందని తెలిపారు. ఇక రెండు స్థానాల్లో సీపీఎం, జేకేఎన్‌పీసీ అభ్యర్ధులు పోటీ చేయనున్నారు. గత కొన్ని రోజులుగా జమ్మూ–కశ్మీర్ ఎన్నికల్లో సీట్ల పంపకాల మీద కాంగ్రెస్, ఎన్‌సీ పార్టీల మధ్య చర్చలు నడిచాయి. ఈ క్రమంలో ఇరు పార్టీల మధ్య వివాదాలు తలెత్తినట్టు కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇద్దరు సీనియర్ నేతలు కేసీ వేణుగోపాల్, సల్మాన్ ఖుర్షీద్‌లు శ్రీనగర్ వెళ్ళి అక్కడ నేతలతో చర్చలు జరిపారు. అవి ఫలించి ఇరు పార్టీలు ఒక ఒప్పందానికి వచ్చాయి. జమ్మూ–కశ్మీర్ ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించారు. ఇందులో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటికి మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. సెప్టెంబరు 18న తొలి విడత, సెప్టెంబరు 25న రెండో విడత, అక్టోబరు 1న మూడో విడత జరగనున్నాయి. అక్టోబర్ 4న ఓట్ల లెక్కింపు చేయనున్నారు. Also Read: Rahul Gandhi: ఆ ఒత్తిడి నుంచి ఇప్పటికి బయటకు వచ్చా..రాహుల్ గాంధీ #congress #elections #jammu-kashmir #seats #national-confrence-party మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి