AP: కోడికత్తి, బాబాయ్ మర్డర్ సినిమాలు కూడా తీయండి.. ఆర్జీవీకి లోకేష్ సలహా ఆర్జీవీ తెరకెక్కించిన 'వ్యూహం' మూవీపై టీడీపీ నాయకుడు లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు. ఎలక్షన్స్ ముందు ఇలాంటి సినిమాలు తీయడం ఓ ఫ్యాషన్ అయిపోయిందని, జగన్ డబ్బులిచ్చి తీయిస్తున్నారని ఆరోపించారు. వర్మగారు కోడికత్తి, హూ కిల్డ్ బాబాయ్.. మూవీస్ కూడా తీయాలని సూచించారు. By srinivas 29 Dec 2023 in ఆంధ్రప్రదేశ్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి AP : రామ్ గోపాల్ వర్మ (RGV) 'వ్యూహం' సినిమాపై నారా లోకేశ్ (LOKESH) సంచలన కామెంట్స్ చేశారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. చిత్రానికి ప్రతివ్యూహం ఉండకూడదంటే ఎలా? అంటూ కోడికత్తి, హై కిల్ బాబాయ్ అనే సినిమాలు కూడా తీయాలని వర్మకు సూచించాడు. ఈ మేరకు లోకేష్ మాట్లాడుతూ.. ‘ఎలక్షన్స్ ముందు ఇలాంటి సినిమాలు తీయడం వర్మకు ఓ ఫ్యాషన్ అయిపోయింది. జగన్ డబ్బులిచ్చి ఇలాంటి సినిమాలు తీయిస్తున్నారు. ఆర్జీవీ తరఫున కోర్టుల్లో వాదనలు వినిపిస్తున్నది కూడా వైకాపా ఎంపీ నిరంజన్ రెడ్డే. ఈ న్యాయవాదులను చూస్తేనే ఆ సినిమా ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. న్యాయపరంగా తమకున్న హక్కుల కోసం పోరాడుతున్నాం. ఆర్జీవీ నిజంగా సినిమా తీయాలంటే హూ కిల్డ్ బాబాయ్, కోడి కత్తి, ప్యాలెస్‌లో జరుగుతున్న అవినీతి మీద కూడా అద్భుతంగా తీయొచ్చు' అంటూ ఆసక్తికరంగా చెప్పుకొచ్చారు. అలాగే చట్టాన్ని ఉల్లంఘించిన అధికారుల పేర్లు మాత్రమే రెడ్‌బుక్‌లో రాస్తున్నామని, తప్పు చేసిన వాళ్ల గురించి మాట్లాడితే తప్పేంటని ప్రశ్నించారు. అధికారులు తప్పు చేసినా మాట్లాడకూడదా? సీఐడీనే స్క్రిప్ట్ రాసివ్వమనండి. అదే చదువుతా. లేదా సజ్జల వంటి వాళ్లు స్క్రిప్ట్ రాసిస్తే అదే చదువుతా. కొల్లి రఘురామిరెడ్డి, పీఎస్సార్ ఆంజనేయులు వంటి వాళ్లు తప్పు చేసినట్టు అంగీకరిస్తున్నారా.. రెడ్‌బుక్‌లో ఎవరి పేర్లు ఉన్నాయో వాళ్లకెలా తెలుసు అంటూ పలు ప్రశ్నలు సంధించారు. ఇది కూడా చదవండి : RGV Vs Journalist : రక్తం మడుగులో శృంగారం.. ఆర్జీవీ Vs జర్నలిస్ట్ వార్ వైరల్ ఇక వచ్చే ఎన్నికల్లో ఓడిపోయే సీట్లనే వైకాపా బీసీలకు ఇస్తోందని లోకేశ్ విమర్శించారు. వైకాపాలో తమకు గుర్తింపు లేదని వైకాపా బీసీ ఎమ్మెల్యే పార్థసారథి ఆవేదన చెందారన్నారు. మంగళగిరిలో రెండు సార్లు రెడ్డిలకే టికెట్ ఇచ్చారు. ఇప్పుడు మంగళగిరిలో ఓడిపోతున్నామని తెలిసే బీసీకి ఇచ్చారు. కడప ఎంపీ స్థానం బీసీలకు ఇవ్వమనండి. పులివెందుల సీటు బీసీలకు ఎందుకివ్వరు? చిలకలూరిపేటలో మంత్రి విడదల రజనీ చెత్త అని సీఎం జగన్ స్పష్టంగా చెప్పేశారు. చిలకలూరిపేటకు పనికి రాని విడదల రజనీ గుంటూరు వెస్ట్‌లో ఎలా పనికొస్తారు? ఓ నియోజకవర్గంలోని చెత్త మరో నియోజకవర్గంలో బంగారం అవుతుందా? అంటూ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. #lokesh #ap #rgv మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి