/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/99.jpg)
Minister Lokesh: సీఎం చంద్రబాబు మడకశిర నియోజకవర్గం పర్యటన సందర్భంగా ఆ ప్రాంత సిపిఎం నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీని గురించి మంత్రి లోకేశ్ ఈరోజు ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు.ఈ ఘటన పట్ల మన్నించాల్సిందిగా కోరుతున్నామని అడిగారు. గృహనిర్బంధాలు, ముందస్తు అరెస్టులకు మా కూటమి ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకమని చెప్పారు. గత ఐదేళ్ల పరదాల ప్రభుత్వం పోయినా ఇంకా కొంత మంది పోలీసుల తీరు మారలేదు. ఇటువంటి అప్రజాస్వామిక అరెస్టులను పునరావృతం కానివ్వమని మంత్రి లోకేశ్ హామీ ఇచ్చారు. ప్రభుత్వాన్ని ప్రజాపక్షమై ప్రశ్నించే హక్కు, ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కులను కాపాడతామని... ఇకపై ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ముందస్తు అరెస్టులు, గృహనిర్బంధాలు లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖ ముఖ్య అధికారులను కోరారు.
మమ్మల్ని మన్నించండి కామ్రేడ్
సీఎం చంద్రబాబు గారి మడకశిర నియోజకవర్గం పర్యటన సందర్భంగా ఆ ప్రాంత సిపిఎం నేతలను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన పట్ల మన్నించాల్సిందిగా కోరుతున్నాం. గృహనిర్బంధాలు, ముందస్తు అరెస్టులకు మా కూటమి ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకం. గత ఐదేళ్ల పరదాల ప్రభుత్వం పోయినా… pic.twitter.com/mkpBnluRIR
— Lokesh Nara (@naralokesh) August 1, 2024
Also Read:Telangana: తెలంగాణలో 8మంది నాన కేడర్ ఎస్పీలు బదిలీ.