Movies:సరిపోదా శనివారం అంటున్న నేచురల్ స్టార్

నేచురల్ స్టార్ నాని సినిమా సినిమాకి వేరియేషన్ చూపిస్తున్నాడు.కొత్త కథలతో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఓ వైపు ఫ్యామిలీ ఆడియన్స్ కి రీచ్ అయ్యే కథలతో మూవీస్ చేస్తూనే మరో వైపు మాస్ ఆడియన్స్ మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. దసరాతో ఈ ఏడాది కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ని అందుకున్న నాని త్వరలో హాయ్ నాన్న సినిమాతో రానున్నాడు. ఇప్పుడు మళ్ళీ సరిపోదా శనివారం అంటూ ఓ మాస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు నాని.

New Update
Movies:సరిపోదా శనివారం అంటున్న నేచురల్ స్టార్

దసరా తర్వాత నాని చేసిన సినిమా హాయ్ నాన్న. ఈ సినిమాతో తండ్రి, కూతుళ్ళ అనుబంధాన్ని తెరపై చూపించడానికి సిద్ధం అవుతున్నాడు. ఇది డిసెంబర్ లో విడుదల కాబోతోంది. దీని షూటింగ్ ఆల్రెడీ అయిపోయి విడుదలకు సిద్ధం అవ్వడంతో వెంటనో మరో మూవీని పట్టాలెక్కించాడు నేచురల్ స్టార్. గ్యాప్ ఇవ్వకుండా వెంట వెంటనే మూవీస్ చేసుకుంటూ పోతున్నాడు. ఇప్పుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాని స్టార్ట్ చేశాడు. ఈరోజు ఈ మూవీ ఇంటరెస్టింగ్ గ్లింప్స్ తో పాటూ టైటిల్ ని కూడా ఎనౌన్స్ చేశారు. అలాగే కాన్సెప్ట్ ని కూడా ఈ గ్లింప్స్ తో చెప్పేశారు.

Also Read:హమాస్ దగ్గర రసాయన ఆయుధాలున్నాయి-ఇజ్రాయెల్ అధ్యక్షుడు

ప్రతి ఒక్కడికి ఒక రోజు వస్తుంది… ఆ రోజు కోసం వెయిట్ చేయాలి అని అందరూ చెప్పే సామెతని కాన్సెప్ట్ గా తీసుకొని సరిపోదా శనివారం మూవీని తెరకెక్కిస్తున్నట్లు అనిపిస్తోంది. సాయి కుమార్ వాయిస్ ఓవర్ తో స్టొరీ ఇంటెన్షన్ ని చెప్పించి ఓ షెడ్ లో చైన్ తో బంధించి ఉన్న నానిని చూపించారు. ఈ సినిమాలో హీరో ప్రతి వారం తనకంటూ ఒక రోజు వస్తుంది. అది శనివారం. ఆ శనివారం హీరో ఏం చేస్తాడు అనే యాంగిల్ లో నాని క్యారెక్టర్ ని ఎస్టాబ్లిష్ చేశారు. సరిపోదా శనివారం అనే టైటిల్ ని మూవీకి పెట్టినట్లు చూపించారు. నాని చైన్ ని బ్రేక్ చేసుకొని తన కోసం ఎదురుచూస్తున్న వారి కోసం ఆ షెడ్ లోంచి వస్తాడు. అతను రావడం చూసిన అందరూ సంతోషిస్తారు. గ్లింప్స్ చూస్తుంటే యాక్షన్ మూవీ ఎలివేషన్ అయితే ఇచ్చారు. కాని వివేక్ ఆత్రేయ అంటేనే జంద్యాల స్టైల్ లో సాగే ప్లెజెంట్ కామెడీతో ఉంటుందని గత మూడు సినిమాలు చూపించాయి. టైటిల్ చూస్తుంటే కూడా కాస్తా వెరైటీగా, సరదాగా ఉంది. ఈ మూవీలో ఎస్.జె.సూర్య విలన్ గా నటిస్తుండగా ప్రియాంకా ఆరుళ్ మోహన్ హీరోయిన్ గా చేస్తోంది. జేక్స్ బిజోయ్ దీనికి మ్యూజిక్ అందిస్తున్నాడు. డివివి దానయ్య భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

రవితేజ ‘మాస్ జాతర’ నుంచి వచ్చేసిన మాస్ సాంగ్.. చూపుల్తో గుచ్చి గుచ్చి.. మ్యూజిక్, స్టెప్స్‌తో అదిరిపోయాయిగా!

మాస్ మహారాజ్ రవితేజ "మాస్ జాతర" మూవీ నుంచి ‘తు మేరా లవర్’ లిరికల్ సాంగ్‌ను మూవీ టీం రిలీజ్ చేసింది. చూపుల్తో గుచ్చి గుచ్చి మ్యూజిక్, సెప్స్‌తో వింటేజ్ రవితేజను గుర్తుచేశారు. ఇందులో హీరోయిన్‌గా శ్రీలీల నటిస్తోంది.

New Update

మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja) "మాస్ జాతర" మూవీతో ప్రేక్షకుల ముందుకు త్వరలో రాబోతున్నాడు. భాను భోగవరపు దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ మూవీకి సంబంధించిన తు మేరా లవర్ అనే పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ పాటలో ఇడియట్ సినిమాలోని చూపుల్తో గుచ్చి గుచ్చి బీట్, డ్యాన్స్‌ను రీమేక్ చేసి మధ్యలో యాడ్ చేశాడు.  

ఇది కూడా చూడండి: HIT 3 Trailer: ఆ నరుకుడు ఏంది సామి.. రక్తం ఏరులైపారిందిగా..! హిట్-3' ట్రైలర్ రిలీజ్..

ఇది కూడా చూడండి: AP Crime: విశాఖలో దారుణం.. మరో 24 గంటల్లో డెలివరీ.. నిండు గర్భిణిని గొంతు పిసికి చంపిన భర్త!

ఇది కూడా చూడండి:Aghori Audio Call Leak: రాధీ నావల్ల కావట్లేదే.. ఫస్ట్‌ వైఫ్‌తో అఘోరీ రాసలీలల ఆడియో లీక్.. ఒక్కసారి విన్నారంటే?

వింటేజ్ రవితేజను గుర్తు చేసేలా..

ఈ పాట అప్పట్లో సంచలనాలు సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ అవే స్టెప్‌లు, మ్యూజిక్‌ వింటేజ్ రవితేజను గుర్తు చేశాయి. ఈ మాస్ సాంగ్‌లో రవితేజ, శ్రీలీల మాస్ బీట్స్‌తో అదరిగొడుతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ పాట ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో ఈ స్టోరీలో చూద్దాం. 

ఇది కూడా చూడండి: Shiva Puja: ఇంట్లో శివలింగం ఏ దిశలో ఉంచాలంటే?: శివభక్తులు తప్పక తెలుసుకోవాల్సిన 5 విషయాలు!

Advertisment
Advertisment
Advertisment