Balakrishna: ఆయన చిటికెన వేలుపై ఉన్న వెంటుక కూడా పీకలేరు.. నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు

సీఎం జగన్‌పై హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కేసులో అవినీతి జరుగలేదని జగన్‌కు తెలిసి కూడా చంద్రబాబును అరెస్ట్‌ చేయించారన్న ఆయన.. టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్‌కు వస్తున్న ప్రజా స్పందన చూసి ఓర్వలేక పోతున్నారన్నారు.

New Update
Balakrishna: ఆయన చిటికెన వేలుపై ఉన్న వెంటుక కూడా పీకలేరు.. నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు

సీఎం జగన్‌పై హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కేసులో అవినీతి జరుగలేదని జగన్‌కు తెలిసి కూడా చంద్రబాబును అరెస్ట్‌ చేయించారన్న ఆయన.. టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్‌కు వస్తున్న ప్రజా స్పందన చూసి ఓర్వలేక పోతున్నారన్నారు. దీంతో లోకేష్‌ను సైతం అరెస్ట్‌ చేయాలని చూస్తున్నారన్నారు. వైఎస్‌ జగన్ మోహన్‌ రెడ్డి లోకేష్‌ను అరెస్ట్‌ కాదు కదా.. అతని చిటికెన వేలు పిక్కపై ఉన్న వెంట్రుక కూడా పీకలేరని సంచలన వ్యాఖ్యలు చేశారు.

లోకేష్‌ను అరెస్ట్‌ చేస్తే ఏమౌతుందో జగన్‌కు అర్దమై ఉంటుదని బాలకృష్ణ అన్నారు. చంద్రబాబు నాయుడిని వైసీపీ పార్టీ రాజకీయంగా ఎదుర్కోలేక అక్రమంగా అరెస్ట్‌ చేయించిందని బాలకృష్ణ మండిపడ్డారు. చంద్రబాబు ప్రజల డబ్బును తినే వ్యక్తి కాదన్నారు. ఆయన ఎప్పుడూ ప్రజలకు ఇంకా ఏ విధంగా మంచి చేయాలని ఆలోచిస్తారన్నారు. ఆయన అసలు ఖాళీగా ఉండరన్న టీడీపీ ఎమ్మెల్యే.. చంద్రబాబు ఖాళీగా ఉంటే రానున్న రోజుల్లో కచ్చితంగా అనేక సంక్షేమ పథకాలు తీసుకువస్తారని వివరించారు.

మరోవైపు ఏపీ సీఐడీ అధికారులు నారా లోకేష్ కు (Nara Lokesh) నోటీసులు పంపించారు. లోకేష్ వాట్సాప్ కు 41 ఏ కింద నోటీసును పంపించారు. ఇందుకు నారా లోకేష్ సైతం స్పందించారు. నోటిసులు అందుకున్నానంటూ సీఐడీ అధికారులకు సమాధానం ఇచ్చారు. అక్టోబర్ 4వ తేదీన ఉదయం 10 గంటలకు సీఐడీ కార్యాలయానికి విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు అధికారులు. ఢిల్లీలోని అశోకా రోడ్డు 50లోని ఎంపీ గల్లా జయదేవ్ కార్యాలయంలో లోకేష్ ఉండగా ఈ నోటీసులు అందాయి. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుకు సంబంధించి ఈ నోటీసులు అందాయి. ఈ నేపథ్యంలో లోకేష్ ఈ నెల 4న ఏపీ రానున్నారు. అయితే.. విచారణ అనంతరం ఆయనను ఆరెస్ట్ చేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

అయితే.. లోకేష్ కు నేరుగా కూడా నోటీసులు ఇచ్చారు సీఐడీ అధికారులు. దీంతో పాటు మెయిల్ ద్వారా కూడా లోకేష్ కు ఏపీ సీఐడీ నోటీసులు పంపించినట్లు తెలుస్తోంది. వాట్సాప్ లో పంపిన తర్వాత మళ్లీ ఎందుకు వచ్చారని సీఐడీ అధికారులను లోకేష్ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఏ కేసు గురించి వచ్చారని కూడా లోకేష్ అడిగినట్లు సమాచారం. లోకేష్ కు 41ఏ సెక్షన్ గురించి సీఐడీ అధికారులు వివరించినట్లు సమాచారం. నోటీసులు క్షుణ్ణంగా చదువుతానని అధికారులతో లోకేష్ అన్నట్లు తెలుస్తోంది. అనంతరం రాక, రాక వచ్చారు కదా.. టీ, కాఫీ తాగాలని సీఐడీ అధికారులతో లోకేష్ కోరగాజ.. వారు తిరస్కరించినట్లు సమాచారం. ఈ అంశంపై సీఐడీ అధికారులు స్పందించారు. లోకేష్ ను తాడేపల్లి సీఐడీ ఆఫీసుకు విచారణ నిమిత్తం పిలిచినట్లు తెలిపారు. ఈ విషయాన్ని నోటీసుల్లో పేర్కొన్నట్లు చెప్పారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు