USA Elections: రేపే బైడెన్ - ట్రంప్‌ మధ్య డిబేట్‌.. ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ

ఈ ఏడాది నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న వేళ.. గురువారం డిమోక్రటిక్ పార్టీ నేత జోబైడెన్, రిపబ్లికన్ పార్టీ నేత ట్రంప్ మధ్య డిబేట్ జరగనుంది. ఈ కార్యక్రమం కోసం అమెరికన్లతో సహా వివిధ దేశాల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

New Update
USA Elections: రేపే బైడెన్ - ట్రంప్‌ మధ్య డిబేట్‌.. ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ

ఈ ఏడాది నవంబర్‌లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. గతంలో లాగే ఈసారి కూడా ప్రస్తుత అధ్యక్షుడు, డెమోక్రటిక్ పార్టీ నేత జో బైడెన్, రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ మధ్య గట్టి పోటీ ఉండనుంది. ఈసారి జరగనున్న ఎన్నికల్లో ఎవరు అధికారంలోకి వస్తారనేదానిపై ప్రపంచ దేశాల్లో ఉత్కంఠ నెలకొంది. అయితే జూన్ 27న గురువారం వీరిద్దరి మధ్య ముఖ్యమైన డిబేట్ జరగనుంది. ఈ కార్యక్రమం కోసం అమెరికన్లతో సహా వివిధ దేశాల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read: ఏపీలో వాలంటీర్లకు ఊహించని షాక్

అమెరికా అధ్యక్ష పోరు కోసం నాలుగేళ్ల తర్వాత బైడెన్, ట్రంప్‌లు ముఖాముఖిగా తలపడనున్నారు. అయితే వారు ఏయే అంశాలపై చర్చిస్తారనేది ఆసక్తిగా మారింది. గురువారం జార్జియాలోని అట్లాంటాలో ఉన్న కేబుల్ న్యూస్ నెట్వర్క్ (CNN) స్టూడియోస్‌లో 90 నిమిషాల పాటు ఈ డిబేట్ కార్యక్రమం జరగనుంది. దీన్ని టీవీల్లో లేదా సోషల్ మీడియాలో చూసేందుకు చాలామంది అమెరికన్లు ఎదురుచూస్తున్నట్లు అసోసియేటెడ్‌ ప్రెస్‌-ఎన్‌ఓఆర్‌సీ పరిశోధక సంస్థ సంయుక్తంగా చేపట్టిన సర్వే పేర్కొంది. ప్రతి పదిమంది అమెరికన్లలో ఆరుగురు ఇది చూసేందుకు ప్లాన్ వేసుకుంటున్నట్లు తెలిపింది. మరోవైపు తమ అభ్యర్థిత్వాలను పరీక్షించుకునేందుకు వాళ్లకి ఇదొక పరీక్ష లాంటిదని ఇరువురి మద్దతుదారులు భావిస్తున్నట్లు తెలిసింది. ఇక మరో డిబేట్‌ సెప్టెంబర్‌ 10న జరగనుంది. ఈ డిబేట్ కార్యక్రమాన్ని ఏబీసీ సంస్థ నిర్వహించనుంది. ఇక వైస్‌ ప్రెసిడెంట్ డిబేట్‌ కూడా సెప్టెంబర్ 25న నిర్వహించాలని కమిషన్ ప్రతిపాదించింది.

డొనాల్డ్‌ ట్రంప్‌పై దూకుడైన వైఖరి ప్రదర్శించాలని జో బైడెన్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. స్థిరమైన నాయకుడు కావాలో లేదా దోషి కావాలో తేల్చుకోమని ఆయన ప్రజలకు పిలుపునివ్వనున్నారు. మరోవైపు జో బైడెన్‌ హయాంలో నిత్యావసర ధరలు, వలసలు పెరగడం లాంటి అంశాలను ట్రంప్‌ అస్త్రాలుగా చేసుకోనున్నట్లు సమాచారం. అయితే అభ్యర్థలిద్దరు వృద్ధాప్యంలో ఉండటం వల్ల ఇరు పార్టీల్లో కూడా కొంత అసంతృప్తి ఉన్నట్లు తెలుస్తోంది. కొన్నేళ్ల నుంచి బైడెన్, ట్రంప్‌లు పరోక్ష విమర్శలకే పరిమితమయ్యారు. ఇప్పుడు ముఖాముఖి తలపడనుండటంతో ఈ చర్చ ఎలా జరగబోతుందనేదానిపై ఉత్కంఠ నెలకొంది.

Also Read: ఉక్రెయిన్ లోకి అమెరికా బలగాలు.. బైడెన్ సర్కార్ బిగ్ స్కెచ్!

Advertisment
Advertisment
తాజా కథనాలు