Mopidevi Venkata ramana: తండ్రికి అన్యాయం జరుగుతుంటే విప్పని నోరు..ఇప్పుడేందుకు!

రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా పురందేశ్వరి మాట్లాడుతున్నారా లేక తన బావ చంద్రబాబు ఉనికిని కాపాడాటానికి ఆమె మాట్లాడుతున్నారా అంటూ బాపట్ల ఎంపీ మోపిదేవి వెంకట రమణారావు ప్రశ్నించారు.

New Update
Mopidevi Venkata ramana: తండ్రికి అన్యాయం జరుగుతుంటే విప్పని నోరు..ఇప్పుడేందుకు!

గత కొద్ది రోజులుగా ఏపీ ప్రభుత్వం (AP Government)  పై బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి (Purandeswari)  విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమె చేస్తున్న విమర్శలు గురించి బాపట్ల ఎంపీ మోపిదేవి వెంకట రమణారావు స్పందించారు. ఏపీలో జగన్‌ కు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాల వారు తీవ్ర విమర్శలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

రాష్ట్రంలో కాంగ్రెస్‌ , చంద్రబాబు కలిసి కొన్ని సంవత్సరాల క్రితమే జగన్‌ మీద తప్పుడు కేసులు పెట్టారు. నిజనిజాలు ఏంటి అనేది న్యాయ స్థానాల్లోనే తేలుతుందని ఆయన అన్నారు. ప్రస్తుతం రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా పురందేశ్వరి మాట్లాడుతున్నారా లేక తన బావ చంద్రబాబు ఉనికిని కాపాడాటానికి ఆమె మాట్లాడుతున్నారా అంటూ ప్రశ్నించారు.

ఆమె ఏమి మాట్లాడిన నిజానిజాలు తెలుసుకుని మాట్లాడాలి. గతంలో ఆమె తండ్రి ఎన్టీఆర్‌ ను వెన్నుపోటు పొడిచి ఆయన చావుకు కారణమైన వాళ్లలో ప్రధాన వ్యక్తి చంద్రబాబు. ఈ విషయం పురందేశ్వరికి తెలియదా అంటూ ఆయన ప్రశ్నించారు. ఎన్టీఆర్‌ ను వెన్నుపోటు పొడిచిన వారిలో ప్రధానమైన వ్యక్తి చంద్రబాబు .

ఆ విషయం గురించి ఆమె ఏనాడు కూడా మాట్లాడింది లేదు. ఎన్టీఆర్‌ ని దెబ్బ తీసే సమయంలో చంద్రబాబుకి ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులు కూడా సహకరించారు. తండ్రికి అన్యాయం జరుగుతుంటే ఆనాడు పురందేశ్వరి కనీసం నోరు మెదపలేదు. ఇన్ని సంవత్సరాలకు చంద్రబాబు అన్యాయాల పుట్ట బద్దలై సాక్ష్యాధారాలతో సహా దొరికిపోయాడు. అరెస్ట్‌ అయ్యాడు.

వ్యవస్థలను మేనేజ్‌ చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని ఆయన అన్నారు. నిజాలను దాయడం. వాస్తవాలను వక్రీకరించడం..నమ్ముకున్న వారిని నట్టేట ముంచటం చంద్రబాబుకు అలవాటే అని ఆయన ఆరోపించారు. తెలంగాణలో ఎన్నికల్లో పోటీ చేయమని చెప్పడం దానికి సంకేతం. ఎప్పటి నుంచో తెలంగాణలో పార్టీని నమ్ముకున్న వారి భవిష్యత్‌ ఏం కావాలి అని ఆయన అన్నారు.

స్వయనా తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఙానేశ్వర్‌ చంద్రబాబు తమను మోసం చేశారని చెప్పాడు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో అశాంతిని నెలకొల్పాలనేది చంద్రబాబు ఆలోచన అంటూ ఆయన ఆరోపించారు.

Also read: దీపావళి గిఫ్ట్స్‌ గా రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌లు..ఉద్యోగులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చిన యజమాని!

Advertisment
Advertisment
తాజా కథనాలు