MLC Kavita: నేటితో ముగియనున్న కవిత జ్యుడీషియల్ కస్టడీ.. మళ్లీ పొడగిస్తారా ? ఎమ్మెల్సీ కవిత జ్యూడిషయల్ నేటితో ముగియనుంది. ఈరోజు ఉదయం 11.00AM గంటలకు కవితను రౌస్ అవెన్యూ కోర్టులో అధికారులు హాజరుపరచనున్నారు. మరో 14 రోజుల పాటు ఆమె జ్యూడీషియల్ రిమాండ్ పొడగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. By B Aravind 09 Apr 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ కవిత.. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. అయితే నేటితో ఆమె జ్యుడిషయల్ రిమాండ్ ముగియనుంది. దీంతో ఈరోజు ఉదయం 11.00AM గంటలకు కవితను రౌస్ అవెన్యూ కోర్టులో అధికారులు హాజరుపరచనున్నారు. మరో 14 రోజుల పాటు ఆమె జ్యూడీషియల్ రిమాండ్ పొడగించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. మార్చి 26 నుంచి కవిత తీహార్ జైల్లో ఉంటున్నారు. తన కుమారుడి పరీక్షలు ఉన్న నేపథ్యంలో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత ఇటీవల పిటిషన్ వేశారు. కానీ దీనిపై సోమవారం విచారించిన కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ పటిషన్‌ను కొట్టివేసింది. Also Read: కేజ్రీవాల్ పిటిషన్‌పై నేడు విచారణ.. జైలా ? బెయిలా ? ఇక కవితను జైల్లో విచారించేందుకు ఇప్పటికే రౌస్ అవెన్యూ కోర్టు సీబీఐకి పర్మీషన్ ఇచ్చింది. ఆమె రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై ఈనెల 16న విచారణ జరగనుంది. ఇదిలాఉండా.. ఢిల్లీ లిక్కర్ కేసులో మార్చి 15న హైదరాబాద్‌లో కవితు ఈడీ అధికారులు అరెస్టు చేశారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆమె అరెస్టు కావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈడీ అధికారులు ఆమెను రెండు విడతలుగా విచారణ చేశారు. ఆ తర్వాత మార్చి 26న తీహార్ జైలుకు తరలించారు. ఆమెకు కోర్టు 14 రోజుల జ్యూడీషియల్ కస్టడి విధించగా.. నేటితో అది ముగియనుంది. అయితే కోర్టు ఈరోజు ఎలాంటి తీర్పు ఇవ్వనుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. Also read: మోడీజీ.. హోదాకు తగ్గట్లు నడుచుకోండి: ప్రధానిపై మమత విమర్శలు! #telugu-news #national-news #delhi-liquor-case #mlc-kavita మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి