Ponnam Prabhakar: బండి సంజయ్‌పై పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ హామీలు అమలు చేస్తే పోటీ నుంచి తప్పుకుంటానని బండి సంజయ్ అన్నారని.. మరి కేంద్రంలో పదేళ్ల పాలనలో బీజేపీ ఎన్ని హామీలు అమలు చేశారో చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. ఇది నిరూపిస్తే కరీంనగర్ నుంచి తమ పార్టీ అభ్యర్థి తప్పుకుంటారని అన్నారు.

New Update
Ponnam Prabhakar: మీకు కేంద్ర మంత్రులుగా ఉండే అర్హత లేదు.. బీజేపీ ఎంపీలపై పొన్నం ఫైర్!

Ponnam Prabhakar Comments On Bandi Sanjay: కాంగ్రెస్‌ ప్రభుత్వం నాలుగు నెలల్లో 6 గ్యారెంటీల్లో (Congress Six Guarantees) తొలుత చేయాల్సినవి అమలు చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా కోహెడలో బీఆర్‌ఎస్‌కు చెందిన మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు మంత్రి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పొన్నం పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ హామీలు అమలు చేస్తే పోటీ నుంచి తప్పుకుంటానని బండి సంజయ్ అన్నారని.. మరి కేంద్రంలో పదేళ్ల పాలనలో బీజేపీ (BJP) ఎన్ని హామీలు అమలు చేశారో చెప్పాలని ప్రశ్నించారు. అలా నిరూపించినట్లైతే.. తమ పార్టీ అభ్యర్థి కరీంనగర్‌లో లోక్‌సభ ఎన్నికల పోటీ నుంచి వైదొలగుతారని సవాలు విసిరారు.

Also Read: పోలీస్ శాఖలో విషాదం.. హెడ్‌ కానిస్టేబుల్ మృతి

ఇదిలాఉండగా.. ఇటీవల బీజేపీ ఎంపీ బండిసంజయ్‌ మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలు ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చి మాట తప్పారని విమర్శించారు. మహిళలకు నెలకు రూ.2500, ఆసరా పింఛన్ రూ.4 వేలు, ఇల్లు లేని పేదలకు స్థలం, రూ.5 లక్షలు, రైతు భరోసా కింద రైతులకు రూ.15 వేలు అందాయా అంటూ ప్రశ్నించారు. వాటిని అమలు చేసినట్లు నామినేషన్ల ఉపసంహరణ గడువులోపు ఆధారాలతో నిరూపిస్తే.. పోటీ నుంచి తప్పుకుంటానని అవసరమైతే కాంగ్రెస్ అభ్యర్థి తరఫున ప్రచారం చేస్తానని అన్నారు. ఇది నిరూపించకుంటే 17 మంది కాంగ్రెస్ అభ్యర్థులు ఎన్నికల బరి నుంచి తప్పుకునేందుకు సిద్ధమా అని సవాల్ చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మంత్రి పొన్నం.. బండి సంజయ్ వ్యాఖ్యలపై స్పందించారు.

Also Read: తనపై ట్రోలింగ్ చేసేవారికి బుద్ధిచెప్పిన ప్రాచీ..

Advertisment
Advertisment
తాజా కథనాలు