Telangana Assembly: కృష్ణా ప్రాజెక్టులపై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి VS హరీశ్‌రావు

కృష్ణా ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించబోమని ప్రభుత్వం ప్రకటించడం రాష్ట్ర ప్రజలు, బీఆర్‌ఎస్‌ విజయమేనని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌ రావు అన్నారు. నల్గొండ జిల్లాకు మోసం చేసినందుకే ప్రజలు బీఆర్‌ఎస్‌ను ఓడించారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు.

New Update
Telangana Assembly: కృష్ణా ప్రాజెక్టులపై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి VS హరీశ్‌రావు

Komatireddy Vs Harish rao in Telangana Assembly: తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కృష్ణా ప్రాజెక్టులకు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు, నీటిపారుదల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Komatireddy Venkat Reddy) మధ్య మాటల యుద్ధం జరిగింది. మంత్రి ఉత్తమ్‌ (Uttam Kumar) పవర్‌ పాయింట్‌ ప్రెజంటేషన్(PPT) ఇచ్చిన తర్వాత హరీశ్‌రావు మాట్లాడేందుకు స్పీకర్ గడ్డం ప్రసాద్‌ అవకాశమిచ్చారు. ప్రభుత్వం వాస్తవానికి దూరంగా ఉన్న ప్రెజంటేషన్‌ ఇచ్చినట్లు హరీశ్‌రావు (Harish Rao) ఆరోపణలు తేశారు. పీపీటీ కోసం తమకు కూడా అవకాశమివ్వాలని కోరామని.. నిజాలు చెప్పేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. కానీ ఇందుకు స్పీకర్ అనుమతించకపోవడం దురదృష్టకరమన్నారు.

Also Read: దేవుడిని నమ్మని వాళ్లు కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు ఓటేయండి.. బండి సంచలన కామెంట్స్

ఇలా మాట్లాడితే ఎలా ?

కృష్ణా ప్రాజెక్టులను (Krishna River) కేఆర్‌ఎంబీకి అప్పగించబోమని ప్రభుత్వం ప్రకటించడం అనేది తెలంగాణ ప్రజలు.. బీఆర్‌ఎస్‌ విజయమేనని అన్నారు. మంగళవారం నల్గొండలో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో సభ (Nalgonda Meeting) పెడుతున్నందువల్లే.. ఈ ప్రకటన చేసి తప్పులను సవరించుకుంటున్నారని వ్యాఖ్యనించారు. అయితే హరీశ్‌ వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి స్పందించారు. నల్గొండ జిల్లాకు మోసం చేసినందుకే ప్రజలు బీఆర్‌ఎస్‌ను (BRS) ఓడించారని విమర్శించారు. ఏపీ అసెంబ్లీలో జగన్ ఇచ్చిన స్టేట్‌మెంట్ వినలేదా అంటూ ప్రశ్నించారు. ఏపీ సీఎం చెప్పాక కూడా తామే తప్పు చేసినట్లు మాట్లాడితే ఎలా అంటూ నిలదీశారు.

కేసీఆర్ క్షమాపణలు చెప్పాలి 

కేసీఆర్, హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి తమ నల్గొండ జిల్లాను మోసం చేశారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. ఇప్పటికీ తాగునీటి సమస్యలు తప్పడం లేదన్నారు. జగదీశ్‌ రెడ్డి ముఖం చెల్లకే ఈరోజు అసెంబ్లీకి రాలేదంటూ ఎద్దేవా చేశారు. కృష్ణా జలాల విషయంలో కేసీఆర్‌ (KCR) ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని.. ఆ తర్వాతే నల్గొండ సభకు రావాలంటూ డిమాండ్ చేశారు.

Also Read: మహానుభావుడు సభకు రాకుండా ఫామ్ హౌస్ లో దాక్కున్నారు.. కేసీఆర్ పై సీఎం ఫైర్

Advertisment
Advertisment
తాజా కథనాలు