రేపు స్కూళ్లకు సెలవు.. ఏ జిల్లాల్లో అంటే

మిచౌంగ్‌ తుపాను ఎఫెక్ట్ కారణంగా మరోసారి స్కూళ్లకు సెలవులు ప్రకటించారు అధికారులు. బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, ఎన్టీఆర్, నెల్లూరు, తిరుపతి, శ్రీకాకుళం, ప్రకాశం, గుంటూరు, విశాఖపట్నం, వైఎస్ఆర్, అన్నమయ్య జిల్లాల్లో సెలవులు ఇస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

New Update
రేపు స్కూళ్లకు సెలవు.. ఏ జిల్లాల్లో అంటే

Tomorrow AP Schools Holiday : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో కీలక ప్రకటన జారీ చేసింది. మిచౌంగ్‌ తుపాను (Cyclone Michaung)ఎఫెక్ట్ తో ఇప్పటికే పలు జాగ్రత్తలు చేపట్టిన అధికారులు స్కూల్ పిల్లల విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. వర్షాలు, తీవ్రమైన గాలులతో తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, బాపట్ల, కృష్ణా తదితర జిల్లాలు ఇప్పటికే అతలాకుతమైపోగా.. వేలాది ఎకరాలు నేల మయమైపోయాయి. దీంతో 11జిల్లాలకు వాతవరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలోనే బుధవారం కూడా స్కూళ్లు, కాలేజీలకు మరోసారి సెలవులు ప్రకటించారు.

Also read :కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించడంపై స్పందించిన గంగూలీ.. ఏమన్నారంటే

ఈ మేరకు బుధవారం బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ఇస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇప్పటికే కృష్ణా, ఎన్టీఆర్, నెల్లూరు, తిరుపతి, శ్రీకాకుళం, ప్రకాశం, గుంటూరు, విశాఖపట్నం, వైఎస్ఆర్, అన్నమయ్య జిల్లాల్లో ఇప్పటికే సెలవులు ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా మిచౌంగ్‌ తీవ్ర తుపాను బాపట్ల (Bapatla)సమీపంలో తీరం దాటింది. దీంతో తీరం వెంబడి గంటకు 90-100కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. తుపాను తీరం దాటినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాలు, ఈదురుగాలుల తీవ్రతతో రైతులకు తీవ్ర నష్టం జరిగింది. పశ్చిమ గోదావరి, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల్లో నష్టం ఎక్కువగా జరిగింది. తుపాను ప్రభావంతో ఈదురుగాలులకు పలుచోట్ల చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేల కూలాయి.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pastor Praveen: ప్రవీణ్ ది ముమ్మాటికీ హత్యే.. ప్రూఫ్స్ ఇవే.. హర్షకుమార్ సంచలన వీడియో!

పాస్టర్ ప్రవీణ్ మృతిపై నిన్న పోలీసులు నిర్వహించిన ప్రెస్ మీట్ పై మాజీ ఎంపీ హర్షకుమార్ ఫైర్ అయ్యారు. మళ్లీ పాత వీడియోలనే విడుదల చేశారన్నారు. యాక్సిడెంట్ అయితే ప్రవీణ్ బ్యాంక్ ఖాతాలు ఎందుకు సీజ్ చేశారని ప్రశ్నించారు. ఇదో నాన్సెన్ ఇన్వెస్టిగేషన్ అన్నారు.

New Update
Pastor Praveen Death GV Harsha Kumar Video

Pastor Praveen Death GV Harsha Kumar Video

ప్రవీణ్ పగడాల మృతి ఆక్సిడెంట్ వల్ల కాదని నమ్ముతున్నాను.మొదటి నుంచి పోలీస్ ఆక్సిడెంట్ కోణంలోనే దర్యాప్తు చేశారు. ఆక్సిడెంట్ అయితే ప్రవీణ్ బ్యాంక్ ఖాతాలు ఎందుకు సీజ్ చేశారు? Laptop, I pad ఎందుకు పోలీస్ లు పట్టుకెళ్లారు.విజయవాడలోనూ కొవ్వూరు లోను ప్రవీణ్ ను పిలిచినది ఎవరు? అసలు షెడ్యూల్ లో మహారాష్ట్ర పూణే వెళ్ళవలసి ఉండగా విజయవాడ,కొవ్వూరు లలో మీటింగ్ ల గురించి షెడ్యూల్ మార్చుకొన్నది నిజం కాదా? బండి ఆబ్జెక్ట్ కు గుద్దితే బండి పై కెగిరి ముందుకు పడాలి గానీ మనిషి మీద పెట్టినట్టు ఎందుకు ఉంది? ఇటువంటి నాన్సెన్ ఇన్వెస్టిగేషన్ లు చేసి మళ్ళీ వీటి మీద మాట్లాడితే చర్యలు తీసుకుంటామని ఎవర్ని బెదిరిస్తారు? అంటూ ధ్వజమెత్తారు.

( Harsha Kumar | telugu-news | telugu breaking news | Pastor Praveen )

Advertisment
Advertisment
Advertisment