Usha Chilukuri Vance: అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థి భార్య ఉషా చిలుకూరి.. ఏపీలో మూలాలు! అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా ఒహియో రిపబ్లికన్ సెనేట్ జేడీ వాన్స్ పేరును ప్రకటించారు. దీంతో జేడీ వాన్స్ సతీమణి, భారత సంతతికి చెందిన ఉషా చిలుకూరీ పేరు మారుమోగిపోతోంది. ఆంధ్రప్రదేశ్ మూలాలున్న ఆమె గురించి తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 17 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ నేషనల్ New Update షేర్ చేయండి ఈ ఏడాది నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జగనున్న సంగతి తెలిసిందే. డెమోక్రాటిక్ పార్టీ నేత, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ మధ్య గట్టి పోటీ ఉండనుంది. ఇప్పటికే ఇరు పార్టీల నేతలు ఎన్నికల ప్రచారాలతో బిజీబిజీగా గడుపుతున్నాయి. అయితే సోమవారం మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పార్టీ సమావేశంలో.. ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఒహియో రిపబ్లికన్ సెనేటర్ జేడీ వాన్స్‌ను ప్రకటించారు. ఆ తర్వాత.. ఒకప్పుడు ట్రంప్ విమర్శకుడిగా వ్యవహరించిన జేడీ వాన్స్.. ఆ పార్టీ సమావేశంలో భారత సంతతికి చెందిన తన భార్య ఉషా చిలుకూరి వాన్స్ చాలా సపోర్ట్ చేసిందంటూ చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో భారత సంతతికి ఉషా చిలుకూరి పేరు మారు మోగిపోతోంది. ఇంతకి ఆమె ఎవరూ, ఎక్కడి నుంచి వచ్చారు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. Also Read: ఒమాన్‌లో భారీ కాల్పులు.. ఆరుగురు మృతుల్లో భారతీయుడు ఆంధ్రప్రదేశ్‌లో మూలాలు ఉషా చిలుకూరి మూలాలు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి. న్యూయార్క్ టైమ్స్ ప్రకారం.. ఆమె తల్లిదండ్రులు భారత్ నుంచి కాలిఫోర్నియాకు వలస వచ్చారు. దీంతో ఉషా కాలిఫోర్నియాలో పుట్టారు. శాన్ డిగో శివారులో పెరిగారు. ఏపీలో కృష్ణ జిల్లా పామర్రు గ్రామానికి చెందిన దంపతుల కూతురే ఉషా చిలుకూరీ. ఆమె తండ్రి రిటైర్డ్ ఫిజీషియన్, తల్లి గృహిణి. ఉషా రాంచో పెనాస్క్విటోస్‌లోని మౌంట్ కార్మెల్ ఉన్నత పాఠశాలలో చదువుకుంది. యేల్ విశ్వవిద్యాలయం నుంచి హిస్టరీలో బ్యాచిలర్ డిగ్రీ, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి ఎంఫిల్ పూర్తి చేసింది. ఉషా యేల్ లా స్కూల్‌లో 2013లో మొదటిసారిగా జేడీ వాన్స్‌ను కలుసుకుంది. వీళ్లిద్దరూ కలిసి శ్వేతజాతి అమెరికన్లలో సామాజిక క్షీణతకు సంబంధించిన సబ్జెక్టుపై సామూహిక చర్చలు నిర్వహిస్తుండేవారు. ఆ తర్వాత తక్కవ కాలంలోని వీళ్లిద్దరూ ప్రేమలో పడ్డారు. జేడీ వాన్స్ తరుచుగా ఉషాను తన యేల్ స్పిరిట్ గైడ్ అంటూ ప్రస్తావించేవారు. యేల్ లా స్కూల్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక.. 2014లో వీళ్లిద్దరు వివాహం చేసుకున్నారు. వీళ్లకు ముగ్గురు పిల్లలు కుమారులు ఇవాన్, వివేక్ కుమార్తె మిరాబెల్. There’s another Great Indian Wedding to celebrate… 🙂 pic.twitter.com/WGDKAvcrv1 — anand mahindra (@anandmahindra) July 16, 2024 అన్ని రంగాల్లో పట్టు అయితే ఉషా యేల్ లా స్కూల్‌లో ఉన్నప్పుడు.. యేల్ లా జర్నల్‌కు ఎగ్జిక్యూటీవ్ డెవలప్‌మెంట్ ఎడిటర్‌గా, అలాగే యేల్ జర్నల్ ఆఫ్ లా అండ్ టెక్నాలజీకి మేనేజింగ్ ఎడిటర్‌గా పనిచేశారు. కేంబ్రిడ్జ్ యూనివర్శిటిలో వామపక్ష ఉదారవాద గ్రూపులతో కలిసి ఆమె పని చేశారు. 2014లో డెమోక్రాట్‌గా నమోదు చేసుకున్నారు. అంతేకాదు US సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జాన్ రాబర్ట్స్, బ్రెట్ కవనాగ్‌కు లా క్లర్క్‌గా పనిచేశారు. సుప్రీంకోర్టులో పని చేయడానికి కంటే ముందు శాన్‌ఫ్రాన్సిస్స్కోలోని ముంగేర్‌తో పాటు వాషింగ్టన్ డీసీలో 2015- 2017 వరకు లాయర్‌గా పని చేశారు. క్లిష్టమైన సివిల్ లిటిగేషన్‌లు, హెల్త్‌కేర్, ఎడ్యుకేషన్, గవర్నెన్స్‌తో సహా అన్ని రంగాలలో ఉషా పట్టుసాధించారు. ఉష తరచుగా బహిరంగ వేదికలపై తన భర్త జేడీ వాన్స్‌కు సపోర్ట్‌గా ఉండేవారు. చాలా ఏళ్లపాటు భర్త రాజకీయ కార్యక్రమాలకు మద్దతిచ్చేవారు. 2016- 2022లో సెనేట్ ప్రచారాలతో సహా వాన్స్ రాజకీయ ప్రచారాలను ముందుండి నడిపించారు. ఆ ఎన్నికల్లో జేడీ వాన్స్ గెలిచారు. తన భర్త రచించిన హిల్ బిల్లి పుస్తకాన్ని సినిమాగా కూడా తీశారు. ఇందులో ఉష చురుకుగా వ్యవహరించారు. ఇందులో శ్వేతజాతి అమెరికన్ల పేదరికం, వాళ్లు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరించారు. ఆ తర్వాత 2018 లో ఒహియోలో రిపబ్లిక్ ఓటర్‌గా నమోదు చేసుకున్నారు. ఉషా తల్లిదండ్రులు సైతం.. ఆమె భర్త రాజకీయ జీవితానికి అండగా ఉండేవారు. ఎన్నికల ప్రచారాల్లో వీళ్లు కూడా పొల్గొనేవారు. Also read: సిద్ధరామయ్యా.. ఎంతపనైంది! ప్రయివేట్ ఉద్యోగాల రిజర్వేషన్లపై కర్ణాటకలో రచ్చ ఉషా చిలుకూరి చరిత్ర సృష్టిస్తుందా ? అయితే ఈ ఎన్నికల్లో ట్రంప్ గెలిస్తే.. జేడీ వాన్స్ వైస్ ప్రెసిడెంట్ అవుతారు. ఒకవేళ ఇదే జరిగితే ఉషా చిలుకూరి భారత సంతతికి చెందిన వైస్ ప్రెసిడెంట్ సతీమణిగా చరిత్ర సృష్టించే అవకాశం దక్కుతుంది. అంతేకాదు జేడీ వాన్స్ వైస్ ప్రెసిడెండ్‌గా ఎన్నికనైట్లేతే.. అమెరికా - ఇండియా సంబంధాలను మరింత బలోపేతం చేయడంతో ఉష కీలక పాత్ర పోషిస్తుందని అక్కడి వారు నమ్ముతున్నారు. ఆమెకు భారతీయ సంస్కృతితో పాటు భారత్ గురించి అన్ని విషయాలు తెలుసని ట్రంప్ కుటుంబంతో రిలేషన్ ఉన్న ఓ వ్యాపారవేత్త తెలిపారు. #telugu-news #donald-trump #usa-elections #usha-chilukuri #jd-vance మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి