Science : భూమి కింద మరో మహా సముద్రం ఉంది.. సైంటిఫిక్ డిస్కవరీలో బయటపడిన నిజాలు

మనం నివసిస్తున్న భూమే కాదు..ఈ ఖగోళం మొత్తం వింతల పుట్ట. మనకు ఈ విశ్వం గురించి తెలిసింది గోరంత అయితే తెలుసుకోవాల్సింది కొండంత ఉంది. తాజాగా మన తిరుగాడుతున్న భూమి మీదనే కాకుండా అడుగున కూడా మహా సముద్రం ఉందని కనుగొన్నారు.ఈ డిస్కవరీ ఇప్పుడు వైరల్ అవుతోంది.

New Update
Science : భూమి కింద మరో మహా సముద్రం ఉంది.. సైంటిఫిక్ డిస్కవరీలో బయటపడిన నిజాలు

Water Under Earth : ఏదో మనం భూమి మీద పుట్టాం కాబట్టా బతికేస్తు్నాం కానీ మనకు దీని గురించి తెలిసింది అవగింజంత కూడా ఉండదు. మనకు అంటే ఇక్కడ సైన్స్ చదువుకున్న వాళ్ళకు, రీసెర్జ్‌లు చేస్తున్నవాళ్ళకు, ఆఖరుకు ఖగోళ శాస్త్రజ్ఞులకు కూడా భూమి దాని పరిస్థితుల గురించి తెలిసింది చాలా తక్కువే. దానికి నిదర్శనమే అను నిత్యం జరుగుతున్న పరిశోధనలు. తాజాగా జరిగిన ఓ శాస్త్రీయ పరిశోధన శాస్త్రవేత్తలను మరింత ఆశ్చర్యపరుతస్ఓంది. దీనికి సంబంధించిన వార్త తెగ వైరల్ అవుతోంది కూడా.

భూమి కింద మరో మహాసముద్రం..

భూమి(Earth) మీద నీరు(Water) ఉంటుంది. ఇది అందరికీ తెలిసిందే. భూమి మీద నేల కొంత శాతం ఉంటే నసముద్రాల రూపంల నీరు మరికొంత శాతం ఉంది. అయితే ఇప్పుడు భూమి కింద కూడా భారీగా నీటి నిల్వలు ఉన్నాయని తెలుస్తోంది. భూమి ఉపరితలానికి 700 కి.మీ దిగువున రింగ్‌వుడైట్ అని పిలవబడే రాతి నిర్మాణంలో నీరు నిలవ్ అవుతోందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. భూమిపైన ఉన్న భూగర్భ జలాశయాలు, సముద్రాల పరిణామాలతో పోలిస్తే భూమి అడుగున్న ఉన్న నీటి నిల్వ మూడురెట్లు ఎక్కువ ఉందిట. దీని తాలూకా వివరాలు 2014లోనే డీహైడ్రేషన్ మెల్టింగ్ ఎట్ ది టాప్ ఆఫ్ ది లోయర్ మాంటిల్(Melting At The Top Of The Lower Mantle) అనే జర్నల్‌లో ప్రచరించారు.

రింగ్‌వుడ్‌ డైట్...

ఇది ఒక స్పాంజిలాంటిది. భూమి అడుగున ఉంటుంది. నీటిని పీల్చుకోవడం, హైడ్రోజన్‌ని ఆకర్షించడానికి.. నీటిని ట్రాప్చేయడానికి అనుమతించేలా రింగ్‌వుడ్ డైట్ క్రిస్టల్ నిర్మాణం కలిగి ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే భూమి నీటి చక్రానికి సంబంధించిన సాక్ష్యాధారాలను చూడగలుగుతున్నామని చెబుతున్నారు డిస్కవరీ టీమ్‌(Discovery Team) లోని కీలక సభ్యుడు జియోఫిజిసిస్ట్ స్టీవ్ జాకబ్‌సన్. అంతేకాదు ఈ రింగ్‌వుడ్‌లో నీరు భూమి ఉపరితలం మీద వాటర్ ఎలా వచ్చిందో కూడా చెప్పగలిగే అవకాశం ఉందని అంటున్నారు. దీని మీద మరిన్ని పరిశోధనలు జరుగుతన్నాయని తెలిపారు.

భూకంపాలను(Earthquake) అధ్యయనం చేస్తున్నప్పుడు భూఉపరితలం కింద ఉన్న షాక్‌వేవ్‌లను గుర్తించే సిస్మోమీటర్‌తో ఈ రింగ్‌వుడ్‌లోని వాటర్ గురించి కనుగొన్నారు శాస్త్రవేత్తలు. భూమి తాలూకా మాంటిల్ ట్రాన్సిషన్ జోన్ అంటే 410- నుండి 660-కిలోమీటర్ల లోతులోని ఖనిజాల అధిక నీటి నిల్వ సామర్థ్యం లోతైన H2O రిజర్వాయర్ తాలూకా అవకాశాన్ని సూచిస్తుంది. ఇది నిలువుగా ప్రవహించే మాంటిల్ నిర్జలీకరణకు కారణమవుతుంది అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ట్రాన్సిషన్ జోన్లో సైంటిస్టులు ఇంటర్‌గ్రాన్యులర్ మెల్ట్‌ని కనుగొన్నారు. ఈ పెద్ద ట్రాన్సిషన్ జోన్, డీహైడ్రేషన్ మెల్టింగ్ నీటిని ట్రాప్ చేయడానికి పనిచేయవచ్చని చెబుతున్నారు.

Also Read:Indore : ప్రాణాలు తీసిన వీడియో కాల్ ప్రాంక్

Advertisment
Advertisment
తాజా కథనాలు