Srisailam: శ్రీశైలంలో భారీ అగ్ని ప్రమాదం.. కోట్ల రూపాయల్లో నష్టం ఆంధ్ర ప్రదేశ్ లోని నంద్యాల జిల్లాలో ప్రముఖ పుణ్య క్సేత్రం అయిన శ్రీశైలంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. లలితాంబికా షాపింగ్ కాంప్లెక్స్ లో అర్థరాత్రి సమయంలో ఎల్ బ్లాక్ సముదాయంలో ఒక్కసారిగా భారీగా మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో దాదాపు 15 షాపులు కాలి బూడిదయ్యాయి. ఈ ప్రమాద సమాచారం అందుకున్న దేవస్థానం అధికారులు వెంటనే.. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకుని, ఎగిసిపడుతున్న మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ విషయం తెలుసుకున్న శ్రీశైలం దేవస్థానం ఈవో లవన్న ఘటనా స్థలికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఈ ప్రమాదంలో సుమారు రెండు కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు దేవస్థానం అధికారులు అంచనా వేస్తున్నారు. షార్ట్ సర్య్కూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. By E. Chinni 31 Aug 2023 in ఆంధ్రప్రదేశ్ క్రైం New Update షేర్ చేయండి Massive Fire Accident at Lalithambika Shopping Complex in Srisailam, 15 shops Burnt: ఆంధ్ర ప్రదేశ్ లో ప్రముఖ పుణ్య క్షేత్రం శ్రీశైలంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అర్థరాత్రి సమయంలో లలితాంబిక షాపింగక్ కాంప్లెక్స్ లో ఎల్ బ్లాక్ సముదాయంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఏకంగా 15 షాపులు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే భారీగా ఎగిసి పడుతున్న మంటలను అగ్ని మాపక సిబ్బంది అదుపులోకి తీసుకొచ్చారు. అర్థరాత్రి సమయంలో అంటుకున్న మంటలు: ఆంధ్ర ప్రదేశ్ లోని నంద్యాల జిల్లాలో ప్రముఖ పుణ్య క్సేత్రం అయిన శ్రీశైలంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. లలితాంబికా షాపింగ్ కాంప్లెక్స్ లో అర్థరాత్రి సమయంలో ఎల్ బ్లాక్ సముదాయంలో ఒక్కసారిగా భారీగా మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో దాదాపు 15 షాపులు కాలి బూడిదయ్యాయి. ఈ ప్రమాద సమాచారం అందుకున్న దేవస్థానం అధికారులు వెంటనే.. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకుని, ఎగిసిపడుతున్న మంటలను అదుపులోకి తెచ్చారు. షార్ట్ సర్క్యూట్ కారణమని అనుమానం: మల్లన్న ఆలయ సమీపంలోని లలితాంబిక షాపింగ్ కాంప్లెక్స్ దుకాణాలలో బుధవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో భారీగా మంటలు చెలరేగాయి. ఎల్ బ్లాక్ లో దాదాపుగా 15 దుకాణాలు మంటలతో దగ్దమయ్యాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ మంటలు చెలరేగి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. ఓ షాపులో చెలరేగిన మంటలు.. పక్కన ఉన్న దుకాణాలకు కూడా వ్యాపించాయి. దుకాణదారులు వెంటనే విద్యుత్ శాఖకు ఫోన్ చేసి.. పవర్ కట్ చేయించారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సుమారు 15 దుకాణాలకు మంటలు వ్యాపించాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న దేవస్థానం వాటర్ ట్యాంకర్, ఫైర్ ఇంజన్ మంటలను అదుపు చేశాయి. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన శ్రీశైలం దేవస్థానం ఈవో లవన్న: ఈ విషయం తెలుసుకున్న శ్రీశైలం దేవస్థానం ఈవో లవన్న ఘటనా స్థలికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఈ ప్రమాదంలో సుమారు రెండు కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు దేవస్థానం అధికారులు అంచనా వేస్తున్నారు. షార్ట్ సర్య్కూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. దుకాణాలపైనే విద్యుత్ స్తంభాలు ఉండడంతో.. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ఈ ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇది కూడా చదవండి: మద్యం తాగిన తర్వాత ఈ ఆహార పదార్థాలను తింటున్నారా.. అయితే జాగ్రత్త!! #andhra-pradesh #crime-news #srisailam #fire-accident #crime #massive-fire-accident #lalithambika-shopping-complex #15-shops-burnt మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి