Cars: దసరాకు కొత్త కారు కొంటున్నారా..? ఆ కారుపై ఏకంగా రూ.65 వేల భారీ డిస్కౌంట్!

మారుతి సుజుకి కొన్ని కార్ల మోడళ్ల పై భారీ తగ్గింపును ప్రకటించింది. ఈ జాబితాలోకి ఆల్టో కే 10, ఎస్‌ప్రెస్సో, సెలెరియో, వ్యాగన్‌ ఆర్‌, స్విఫ్ట్‌ వంటి కార్లు ఉన్నాయి.మారుతి సుజుకి హ్యాచ్ బ్యాక్ పై కంపెనీ 68 వేల రూపాయాలను తగ్గించి వినియోగదారులకు అందిస్తోంది. అయితే ఈ ఆఫర్‌ కేవలం సీఎన్జీ వేరియంట్‌ కు మాత్రమే. ఇతర కే 10 వేరియంట్ల పై ఇప్పటికే రూ.53 వేలు వరకు తగ్గింపు ఇస్తోంది.

New Update
Cars: దసరాకు కొత్త కారు కొంటున్నారా..? ఆ కారుపై ఏకంగా రూ.65 వేల భారీ డిస్కౌంట్!

దేశంలో ఇప్పటికే పండుగల సీజన్‌ మొదలైపోయింది. ఇప్పటికే ఆన్‌ లైన్‌ సంస్థలు అన్ని కూడా వాటి ఆఫర్లతో ముందుకు వచ్చేశాయి. బిగ్‌ బిలియన్‌ డేస్‌, గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్స్‌ అంటూ తెగ ఆఫర్లు పెట్టేశాయి. వినియోగదారుల్ని బాగా ఆకర్షించే ఆఫర్లు పెట్టేసి తన వైపునకు లాగేసుకుంటున్నాయి ఈ కామర్స్ సంస్థలు.

పండుగ సీజన్‌ ను తమకు అనుగుణంగా మార్చుకోవాలనుకుంటున్నాయి ప్రముఖ కార్ల తయారీ సంస్థలు..దీంతో తమ కార్ల పై వివిధ రకాల ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలోనే మారుతి సుజుకి కొన్ని కార్ల మోడళ్ల పై భారీ తగ్గింపును ప్రకటించింది. ఈ జాబితాలోకి ఆల్టో కే 10, ఎస్‌ప్రెస్సో, సెలెరియో, వ్యాగన్‌ ఆర్‌, స్విఫ్ట్‌ వంటి కార్లు ఉన్నాయి.

Also read: గుండెపోటుతో ప్రముఖ బాడీ బిల్డర్ మృతి

మారుతి సుజుకి ఆల్టో కే 10: మారుతి సుజుకి హ్యాచ్ బ్యాక్ పై కంపెనీ 68 వేల రూపాయాలను తగ్గించి వినియోగదారులకు అందిస్తోంది. అయితే ఈ ఆఫర్‌ కేవలం సీఎన్జీ వేరియంట్‌ కు మాత్రమే. ఇతర కే 10 వేరియంట్ల పై ఇప్పటికే రూ.53 వేలు వరకు తగ్గింపు ఇస్తోంది.

మారుతి సుజుకి ఎస్ ప్రెస్సో: ఈ కారు పై రూ.68 వేలు వరకు తగ్గింపు ఇస్తుంది. కే 10 కార్ల మాదిరిగా కేవలం సీఎన్జీ కే ఈ ఆఫర్‌ వర్తిస్తుంది.

మారుతి సుజుకి సెలెరియో: మారుతి సుజుకి ఆల్టో కే 10, ఎస్ ప్రెస్సో మాదిరిగానే సెలెరియా సీఎన్జీ వేరియంట్ పై రూ.68 వేలు వరకు డిస్కౌంట్‌ ఉంది. అయితే సాధారణ వేరియంట్‌ పై 51 వేలు తగ్గింపు ఉంది.

Also Read: 12 గంటల పాటు రాళ్ల గుట్టల్లో యువతి నరకయాతన!

మారుతి సుజుకి వ్యాగన్‌ ఆర్‌: దేశంలో ఎక్కువగా అమ్ముడవుతున్న హ్యాచ్‌ బ్యాక్‌ లలో వ్యాగన్‌ ఆర్‌ ఒకటి. ఈ కారు పై ఇప్పటికే సీఎన్‌జీ 58 వేల తగ్గింపు ఇస్తుంది. అయితే ఇతర వేరియంట్ల పై ఇప్పటికే రూ. 46 వేలు తగ్గింపు ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

మారుతి సుజుకి స్విఫ్ట్‌: ఫెస్టివల్‌ సీజన్‌ సందర్భంగా స్విఫ్ట్‌ కార్‌ ఎల్‌ఎక్స్‌ఐ వేరియంట్‌ పై రూ. 47 వేలు వరకు తగ్గింపును అందిస్తోంది. దీంతో పాటు ఇతర వేరియంట్ల పై రూ.42 వరకు తగ్గింపును పొందుతారు. మారుతి సుజుకి స్విఫ్ట్‌ సీఎన్‌జీ వేరియంట్ పై రూ.33 వేలు వరకు తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు.

Advertisment
Advertisment
తాజా కథనాలు