ప్రభుత్వ అసమర్థత వల్లే అనేక మంది మరణించారు సీఎం కేసీఆర్‌పై బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఫైర్ అయ్యారు. రాష్గ్ర ప్రభుత్వ అసమర్థత వల్లే అనేక మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. ముంపు ప్రాంత వాసులకు వరదలు వస్తున్నట్లు ముందే సమాచారం ఇస్తే ప్రాణనష్టం జరిగేది కాదన్నారు. వరదల వల్ల మృతి చెందిన వారి కుటుంబాలను, ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులైన వారిని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు By Karthik 28 Jul 2023 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నా.. ప్రభుత్వం ఏం చేస్తోందని ఆయన ప్రశ్నించారు. వర్షాలకు రాష్ట వ్యాప్తంగా బారీగా ఆస్తి నష్టం జరిగిందని, భారీ వరదల వల్ల 20 మంది మృతి చెందగా.. మరో 25 మంది గల్లంతయ్యారని తెలిపారు. ప్రభుత్వం గల్లంతైన వారి ఆచూకీ ఇంతవరకు కనుక్కోలేక పోయిందని విమర్శించారు. గతంలో తెలంగాణలో వర్షాలు, వరదల వల్ల మరణాలు సంభవించిన దాఖలాలు లేవన్నారు. ప్రభుత్వం వరద బాధిత కుటుంబాలను ఆదుకోవాలని బండి సంజయ్ కోరారు. మృతుల కుటుంబాలకు 20 లక్షల పరిహారం అందించాలని, వరదల్లో ఇళ్లు కోల్పోయిన వారికి 10 లక్షల పరిహారం ఇవ్వాలన్నారు. భారీ ఎత్తున వరదలు వస్తున్నా ప్రభుత్వ అధికారులు ఎందుకు స్పందించలేదని ఎంపీ ప్రశ్నించారు. ఎన్డీఆర్‌ఎఫ్(ndrf) బృందాలు వచ్చే వరకు ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారన్నారు. కేసీఆర్ సర్కార్ (KCR Sarkar) పని దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్టు ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ముందే స్పందిస్తే ఇంతలా ప్రాణ నష్టం జరిగి ఉండేది కాదన్నారు. వతావరణ శాఖ కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్, మరి కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించినా ప్రభుత్వం ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి సరైన సహకారం అందకపోవడంతో అనేక మంది ఇళ్లు కొల్పోయి రోడ్లమీదకు వచ్చారన్న బండి సంజయ్.. ప్రగతి భవన్(Pragati Bhavan)లోకి వరద వస్తే కేసీఆర్‌కు వరద బాధితుల కష్టాలు తెలుస్తాయన్నారు. మరోవైపు ఈ నెల 30న (ఆదివారం) కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో బండి సంజయ్ (Bandi Sanjay) పర్యటించనున్నారు. సీఎం కేసీఆర్ (cm kcr)కు ఎన్నికల సమయంలోనే ప్రజలు గుర్తొస్తారని, అనంతరం వారు ఏమైతే నాకేంటి అనే రీతిలో ఉన్నారన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా నిద్రలేచి వరదల్లో ఇళ్లు కోల్పోయిన వారికి యుద్ధ ప్రాతిపదికన పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని వెల్లడించారు. బీజేపీ (bjp) కార్యకర్తలు వరద ప్రభావిత ప్రాంతాల్లో తిరగాలని, వరద బాధితులకు అత్యవసర సహాయం అందించాలని పిలుపునిచ్చారు. బీజేపీ పార్టీ బాధితులకు అండగా ఉండాలని సూచించారు. హైదరాబాద్(Hyderabad)లో సైతం అనేక ప్రాంతాల్లో వరద నీరు చేరిందని దీంతో పరిసర ప్రాంత వాసులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని బండి సంజయ్ గుర్తు చేశారు. ముఖ్యంగా మూసీ (musi) పరివాహక ప్రాతాల్లో ఇళ్లు నీటిలో నానుతున్నాయన బండి సంజయ్.. హైదరాబాద్‌లోని ముంపు ప్రాంతాల్లో ఉన్న ఇళ్లు నీటిలో మునగకుండా శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. #brs #kcr #bjp #bandi-sanjay #floods #government #homeless మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి