Mamata Benarjee: మహువా మొయిత్రా వివాదం.. ఎట్టకేలకు మౌనం వీడిన మమతా బెనర్జీ..

డబ్బులు తీసుకొని లోక్‌సభలో ప్రశ్నలు అడిగారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మహువా మొయిత్రా వివాదంపై టీఎంసీ అధినేత్రి మమదా బెనర్జీ స్పందించారు. మహువాను లోక్‌ సభ నుంచి బహిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారని.. కానీ లోక్‌సభ ఎన్నికలకు ముందు ఇదే ఆమెకు సాయపడుతుందని వ్యాఖ్యానించారు.

New Update
Mamata Benarjee: మహువా మొయిత్రా వివాదం.. ఎట్టకేలకు మౌనం వీడిన మమతా బెనర్జీ..

డబ్బులు తీసుకొని లోక్‌సభలో ప్రశ్నలు అడిగారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా వివాదంపై ఆ పార్టీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎట్టకేలకు మౌనం వీడారు. లోక్‌సభ నుంచి మహువాను బహిష్కరించేందుకే ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపణలు చేశారు. అయితే రాబోయే లోక్‌సభల ఎన్నికల్లో ఇవి ఆమెకు సహాయపడతాయని పేర్కొన్నారు. కోల్‌కతాలోని నేతాజీ స్టేడింయలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మమతా బెనర్జీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం విపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుంటున్న కేంద్ర సంస్థలు 2024 తర్వాత బీజేపీతోనే వెళ్తాయని అన్నారు. కేంద్రంలో అధికార ప్రభుత్వం మరో మూడు నెలలు మాత్రమే ఉంటుందని.. వివిధ కేసుల్లో మా పార్టీ నేతలను అరెస్టు చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు.

Also read: రాహుల్‌ గాంధీకి షోకాజ్‌ నోటీసులు పంపిన ఎలక్షన్‌ కమిషన్.. ఎందుకో తెలుసా..

మహువాను లోక్‌సభ నుంచి బహిష్కరించేందుకు వారు ప్రయత్నాలు చేస్తున్నా చివరికి ఇదే ఆమెకు లోక్‌సభ ఎన్నికల ముందు సాయం చేస్తుందని అన్నారు. ఇదిలా ఉండగా.. వరల్డ్‌ కప్‌ పైనల్‌లో భారత్‌ ఓడిపోవడంపై కూడా మహువా స్పందించారు. ఫైనల్ మ్యాచ్‌ కోల్‌కతా లేదా ముంబయిలో జరిగి ఉండే టీమిండియా విజయం సాధించి ఉండేదని దీదీ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. పారిశ్రామికవేత్త హిరానందని నుంచి డబ్బులు తీసుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మహువా మొయిత్రాను లోక్‌సభ నుంచి బహిష్కరించాలని లోక్‌సభ నైతిక విలువల కమిటీ సిఫార్సు చేసినట్లు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఎట్టకేలకు మౌనం వీడిన సీఎం మమతా బెనర్జీ మహూవాకు మద్దతుగా మాట్లాడారు.

#bjp #mahua-moitra #national-news #telugu-news #tmc #mamata-benarjee
Advertisment
Advertisment
తాజా కథనాలు