SSMB29: ఉగాదికి రాజమౌళి, మహేష్ బాబు సినిమా..? టైటిల్ ఏంటో తెలుసా

మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో ఓ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీని ఉగాది సందర్భంగా ఏప్రిల్ 9న అనౌన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు 'మహారాజా' అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్లు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది.

New Update
SSMB29: ఉగాదికి రాజమౌళి, మహేష్ బాబు సినిమా..? టైటిల్ ఏంటో తెలుసా

SSMB29: ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ జక్కన్న నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ SSMB29. RRR తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో రాబోతున్న సినిమా SSMB29. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు మహేష్ బాబు ఫ్యాన్స్. ఇప్పటికే ఈ సినిమా పై ఎన్నో ఊహాగానాలు తెగ ప్రచారమవుతున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా ఇండోనేషియా బ్యూటీ చెల్సియా నటిస్తున్నట్లు, మహేష్ బాబు ఈ సినిమాకు జీరో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారంటూ పలు వార్తలు వైరలైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో లేటెస్ట్ అప్డేట్ బయటకు వచ్చింది.

Rashmika Mandanna: ఎయిర్ పోర్ట్ లో రష్మికకు జపాన్ ఫ్యాన్స్ సర్ప్రైజ్.. ఏం చేశారో తెలిస్తే షాకవుతారు..!

publive-image

ఉగాదికి అనౌన్స్ చేయనున్న SSMB29

స్టార్ డైరెక్టర్ రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో రాబోతున్న ఈ సినిమాను ఉగాది సందర్భంగా ఏప్రిల్ 9న అధికారికంగా అనౌన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. అంతే కాదు ఈ సినిమాకు "మహారాజా" అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఆస్కార్ గ్రహీత ఎం ఎం కీరవాణి సంగీతం అందించనుండగా.. కే. ఎల్ నారాయణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కానీ దీనికి సంబంధించి మేకర్స్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. త్వరలోనే అనౌన్స్ చేయబోతున్నట్లు సమాచారం.

ఇటీవలే 'గుంటూరు కారం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు మహేష్. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. మహేష్ బాబు మాస్ డైలాగ్స్, యాక్షన్ సీన్స్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి. రమ్యకృష్ణ, శ్రీలీల, వెన్నెల కిషోర్, మీనాక్షి చౌదరి, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోహించారు.

Also Read: Manchu Vishnu: భర్త అంటే ఇలా ఉండాలి .పెళ్లి రోజు గిఫ్ట్ గా భార్యని మంచు విష్ణు ఎలా సప్రైజ్ చేశాడంటే..?

Advertisment
Advertisment
తాజా కథనాలు