Fire Accident At Kumbh Mela: మహాకుంభమేళాలో చెలరేగిన మంటలు.. భయంతో భక్తులు పరుగులు!

మహా కుంభమేళాలో సెక్టార్ 22లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో టెంట్లు అన్ని తగలబడి పోతున్నాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

New Update
KUMBH FIRE

KUMBH FIRE Photograph: (KUMBH FIRE)

Fire Accident At Kumbh Mela: మహా కుంభమేళాలో మరోసారి అపశృతి చోటుచేసుకుంది. సెక్టార్ 22(Sector 22)లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో టెంట్లు అన్ని తగలబడ్డాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకుంటున్నారు. భక్తులు, వీఐపీల వసతి కోసం పెద్ద ఎత్తున టెంట్లు ఏర్పాటు చేశారు. అయితే జనవరి 19న ఇవే టెంట్లు దగ్గర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మళ్లీ ఇదే ప్లేస్‌లో టెంట్లు తగలబడటంతో భక్తులు ఆందోళనతో పరుగులు తీస్తున్నారు. అసలు మంటలు చెలరేగడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

ఇది కూడా చూడండి: Siddipet Incident: తల్లీకూతుళ్ల ప్రాణం తీసిన కరువుపని.. సిద్దిపేటలో పెను విషాదం!

ఇది కూడా చూడండి: తస్సాదియ్యా మామూలోడు కాదయ్యా సిరాజ్ : ఆమెతో కాదు.. ఈమెతో డేటింగ్!

పది రోజుల్లో మరోసారి ప్రమాదం..

మహా కుంభమేళాలో సెక్టార్ 22 ఏరియాలో భక్తుల కోసం భారీగా టెంట్లు ఏర్పాటు చేశారు. దీనికి సమీపంలోనే గంగ, యమున, సరస్వతి నదులు సంగమం ఉంటుంది. వీటి దగ్గర స్నానం ఆచరించాల్సిన వారందరూ కూడా ఇక్కడే వెళ్తుంటారు. కేవలం 10 రోజుల్లో మరోసారి అగ్ని ప్రమాదం ఘటన చోటుచేసుకుంది. మొదటిసారి గ్యాస్ సిలిండర్ల వల్ల ప్రమాదం జరిగింది. 

ఇది కూడా చూడండి: Maha Kumbh mela: వీవీఐపీల పాస్‌ లు రద్దు..వాహనాలకు కూడా నో ఎంట్రీ..కుంభమేళాలో మార్పులు!

ఇదిలా ఉండగా.. మౌని అమావాస్య సందర్భంగా బుధవారం మహా కుంభమేళాలో తొక్కిసలాట జరిగింది. ఇందులో దాదాపు 30 మందికి పైగా మృతి చెందారు. ఇంతలోనే మళ్లీ మంటలు చెలరేగడంతో భక్తులు భయాందోళన చెందుతున్నారు.

ఇది కూడా చూడండి:  USA: గడ్డకట్టే చలిలో నీళ్ళల్లో పడి బతకడం కష్టమే..ఇప్పటికి 18మంది మృతి

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు