Madyapradesh: మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారం..! మధ్యప్రదేశ్‌లో మోహన్ యాదవ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో సహా కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజర్యయారు. అలాగే ఈరోజునే ఛత్తీస్‌గడ్‌లో విష్ణు దేవ్ సాయి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. By B Aravind 13 Dec 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి ఇటీవల ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో.. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గడ్, రాజస్థాన్‌లో బీజేపీ విజయ భేరి మోగించిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఈ రాష్ట్రాల్లో ఎవరినీ ముఖ్యమంత్రి చేయాలా అనేదానిపై బీజేపీ అధిష్ఠానం మంథనాలు జరిపింది. ఇక చివరికి మూడు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులను ఎంపిక చేసింది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్, ఛత్తీస్‌గడ్‌కు విష్ణు దేవ్ సాయి అలాగే రాజస్థాన్‌కు భజన్ లాల్ శర్మలను సీఎంలకు ఎంపిక చేసింది. అయితే మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో మోహన్ యాదవ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో సహా కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు, యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ తదితరులు హాజరయ్యారు. డిప్యూటీ సీఎంగా.. జగదీష్ దేవ్‌డా బాధ్యతలు చేపట్టారు. అలాగే పలువురు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. మధ్యప్రదేశ్‌లో మూడు సార్లు సీఎంగా పనిచేసిన శివరాజ్‌సింగ్ చౌహన్‌ను పక్కన పెట్టి.. యాదవ సామాజిక వర్గానికి చెందిన మోహన్ యాదవ్‌కు బీజేపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు అప్పజెప్పింది. Also Read: తెలంగాణ తొలి దళిత స్పీకర్ గా గడ్డం ప్రసాదరావు…బ్యాక్ గ్రౌండ్ ఇదే. మరోవైపు ఛత్తీస్‌గఢ్‌లో కూడా విష్ణు దేవ్ సాయి ఈరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈయన గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఇక్కడ కూడా బీజేపీ గిరిజన సామాజిక వర్గానికి చెందిన విష్ణు దేవ్ సాయికి ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించింది. రాబోయే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే బీజేపీ ఇలా మార్పులు చేసిందన్న ప్రచారాలు జరుగుతున్నాయి. మరోవైపు రాజస్థాన్‌లో సీఎంగా ఎంపికైన భజన్‌లాల్ శర్మ డిసెంబర్ 15న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. Also Read: ఆ ఊరిలో ఒకే కుటుంబం ఉంటోంది.. ఎందుకో తెలుసా ? #telugu-news #bjp #chattisgarh #madyapradesh మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి