EVM : ఈవీఎంలను ధ్వంసం చేసిన పిన్నెల్లి... బయటకు వచ్చిన సీసీ ఫుటేజీలు! ఏపీలో ఈ నెల 13న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మాచర్లలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసిన ఆరాచకాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రం (202) లోకి వెళ్లిన పిన్నెల్లి, అక్కడ ఈవీఎం ఎత్తి నేలకేసి కొట్టడంతో వీవీ ప్యాట్ మిషన్‌ను ధ్వంసం చేశారు. By Bhavana 22 May 2024 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి Pinnelli : ఏపీ (AP) లో ఈ నెల 13న అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) సందర్భంగా మాచర్లలో వైసీపీ (YCP) ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) చేసిన ఆరాచకాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రం (202) లోకి వెళ్లిన పిన్నెల్లి, అక్కడ ఈవీఎం (EVM) ఎత్తి నేలకేసి కొట్టడంతో పాటు వీవీ ప్యాట్ మిషన్‌ను ధ్వంసం చేశారు. ఈ ఘటనతో పోలింగ్ సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. దీంతో అక్కడే ఉన్న విపక్షపార్టీ పోలింగ్ ఏజెంట్ ఒక్క ఉదుటున దూసుకెళ్లి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరుడిపై దాడి చేశాడు. ఈవీఎం ధ్వంసం చేసిన ఎమ్మెల్యే పైనా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ దృశ్యాలన్నీ పోలీంగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరా లో రికార్డయ్యాయి. ఎన్నికల ముందు నుంచీ మాచర్లలో పిన్నెల్లి సోదరుల అరాచకాలు పెచ్చుమీరుతున్నాయంటూ టీడీపీ చేసిన ఆరోపణలకు బలం చేకూర్చేట్లు, ఏకంగా ఎమ్మెల్యేనే పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఈవీఎంలను, వీవీ ప్యాట్లను దౌర్జన్యం చేయడం చూస్తే అక్కడ పోలింగ్ ఏవిధంగా సాగిందో ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు. పల్నాడు జిల్లాలో వైఎస్సార్సీపీ శ్రేణుల వల్లే విధ్వంసం జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈ దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరాయి. Your browser does not support the video tag. ఇదిలా ఉంటే ఇప్పటికే ఎమ్మెల్యే పిన్నెల్లి, ఆయన సోదరుడు పల్నాడు జిల్లా వదిలి హైదరాబాద్ వెళ్లిపోయారు. దాడులకు పాల్పడిన పిన్నెల్లి, పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతోనే హైదరాబాద్ వెళ్లారని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. మాచర్ల ప్రాంతంలో జరిగిన ఘటనలు గురించి సిట్టింగ్ జడ్జితో విచారణకు తాము సిద్ధంగా ఉన్నామని మాచర్ల నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డి స్పష్టం చేశారు. దీనికి పిన్నెల్లి సోదరులు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. ఈసీ ఆగ్రహం: ఈవీఎంలను ధ్వంసం చేయడాన్ని ఈసీ తీవ్రంగా పరిగణించింది. కఠినంగా వ్యవహరించాలని డీజీపీని ఆదేశించింది. అందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈవీఏంల ధ్వంసం ఘటనకు సంబంధించి కేసు దర్యాప్తులో సహకరించేందుకు పల్నాడు జిల్లా ఎన్నికల అధికారులు అటువంటి అన్ని పోలింగ్ స్టేషన్ల వీడియో ఫుటేజీని పోలీసులకు అందజేశారు. విచారణలో ఎమ్మెల్యే పేరును నిందితుడిగా చేర్చినట్లు పోలీసులు స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ఈసీ చాలా తీవ్రంగా పరిగణిస్తూ, ఈ ఘటనల్లో ప్రమేయం ఉన్న వ్యక్తులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు. Also read: ఫైనల్ కు చేరిన కేకేఆర్..హైదరాబాద్ మీద ఘన విజయం! #pinnelli-ramakrishna-reddy #ap #elections #evm #palnadu #julakanti మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి