/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/31-jpg.webp)
Lion Killed Man While Taking Selfie: తిరుపతి జూపార్క్‌లో (Tirupati Sri Venkateswara Zoo Park) విషాదం చోటు చేసుకుంది. సెల్ఫీ తీసుకోవాలన్న కోరిక ఓ యువకుడి ప్రాణాలను తీసింది. జూలో కేజ్‌లో ఉన్న సింహంతో సెల్ఫీ దిగాలనుకున్నాడు రాజస్థాన్ కు చెందిన ప్రహ్లాద్. దానికోసం దొంగతనంగా కేజ్‌లోకి దూరాడు. సింహంతో సెల్ఫీ దిగేసి వచ్చేయాలనుకున్నాడు. కానీ ఇంతలో సింహం ప్రహ్లాద్‌ను చూసేసింది...గాండ్రించింది. దీంతో అతను చాలా భయపడి పోయాడు. పక్కనే ఉన్న చెట్టును ఎక్కాడు. కానీ ప్రమాదవశాత్తు చెట్టు మీద నుంచి కూడా పడిపోయాడు. అదను కోసం చూస్తున్న సింహం ప్రహ్లాద మీద వెంటనే దాడి చేసింది. అతనిని ముక్కలు ముక్కలు చేసేసింది. దాంతో ప్రహ్లాద అక్కడిక్కడే చనిపోయాడు.
Also Read: International:పదేళ్ళ పిల్లను కిరాతకంగా హింసించి చంపిన కేర్ టేకర్స్
ఇంతకు ముందు కూడా ఇలాంటి సంఘటనలు..
ఇలాంటి ఘటనలు ఇంతకు ముందు కూడా చాలానే జరిగాయి. హైదరాబాద్ జూలో కూడా ఒక వ్యక్తి ఇలానే పులి బోనులోకి వెళ్ళాడు. అయితే అదృష్టవశాత్తు అతని మీద పులి అటాక్ చేసే లోపే అతనిని జూ సిబ్బంది కాపాడారు. 2019 జనవరి 20న జిరాక్ పూర్ లో మొహేంద్ర చౌదరి జులాజికల్ పార్క్ లో 22 ఏళ్ల వ్యక్తిని సింహం ఇలానే చంపింది.పంజాబ్ రాష్ట్రంలోని మహేంద్ర చౌదరి జూపార్క్ లో సింహల దాడిలో ఓ వ్యక్తి మరణించిన ఘటన 2019 జూన్ 21న జరిగింది. ఘనా దేశంలో, పాకిస్తాన్‌లో, బహవాల్ పూర్‌లో ఇలా చోట్ల సింహం కేజ్‌లోకి మనుషులు వెళ్ళడం..చనిపోవడం చోటు చేసుకున్నాయి.
జూ పార్క్‌లో స్పష్టంగా నియమాలు...
ప్రతీ జూపార్క్‌లో పులుల, సింహాలు, ఏనుగులు ఉన్న ఎన్‌్క్లోజర్‌లోకి వెళ్ళొద్దని చాలా స్పష్టంగా రాస్తారు. ప్రతీ చోట వన్యప్రాణుల సంరక్షణ నియమాలు ఉంటాయి. అసలు వాటిని చూడ్డానికి వెళ్ళినప్పుడే గట్టిగా శబ్దాలు చేయొద్దని, అరవొద్దని, రెచ్చగొట్టే విన్యాసాలు చేయోద్దని చెబుతారు. అయినా కూడా మనుషులకు అత్యుత్సాహం ఆగదు. వాటిని రెచ్చగొట్టే పనులు చేస్తుంటారు. దానికి తోడు కొంతమంది వాటితో ఫోటోల కోసం ఎన్‌క్లోజర్ లోపలికి వెళతుంటారు. చివరకు ప్రాణాలు పోగొట్టుకుంటారు.