/rtv/media/media_files/2024/12/22/greenvegetables22.jpeg)
vegetables
వేసవిలో చాలా మంది ఎక్కువగా ఆకుకూరలు తింటారు. ఆకుకూరలు తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారు. వేసవిలో చాలా మంది నాన్‌వెజ్ కంటే వెజ్‌కి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎందుకంటే మాంసం వల్ల బాడీ హీట్ అవుతుంది. అదే ఆకుకూరలు అయితే ఆ సమస్య ఉండదని తింటారు. కానీ ప్రస్తుతం రోజుల్లో ఎక్కువగా కూరగాయలను రసాయనాలతో పండిస్తున్నారు. మిగతా సీజన్‌లతో పోలిస్తే వేసవిలో వాటర్ తక్కువగా ఉంటుంది. దీంతో చాలా మంది రసాయనాలతో వీటిని పండిస్తారు.
ఇది కూడా చూడండి: Betting Apps Anvesh: యూట్యూబర్ VR రాజాపై అన్వేష్ ఫైర్.. గడ్డి తింటున్నారంటూ ఆగ్రహం!
క్రిమి సంహారక మందులు వాడటం వల్ల..
ఇలాంటి కూరగాయలను వేసవిలో తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేసవిలో కూరగాయలు బాగా ఏపుగా పండటానికి వీటిని వాడుతారు. వీటిపై ఎక్కువగా క్రిమి సంహారక మందులు కూడా వాడటం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇలాంటి కూరగాయలను తింటే మధుమేహం, గుండెపోటు, ఊబకాయం, క్యాన్సర్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేసవిలో కూరగాయలను తింటే మాత్రం ఇంటికి తీసుకొచ్చి బాగా శుభ్రం చేయాలి.
ఇది కూడా చూడండి: వీడు మగాడ్రా బుజ్జి.. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చి..జట్టును గెలిపించి!
మార్కెట్ నుంచి తెచ్చిన కూరగాయలను వెనిగర్ నీటిలో వేసి ఒక 20 నిమిషాల పాటు ఉంచాలి. ఆ తర్వత వాటిని ఆరబెట్టి ఉప్పు నీటితో మళ్లీ కడగాలి. ఇలా రెండు సార్లు కూరగాయలను కడిగిన తర్వాత మాత్రమే వండాలి. లేకపోతే దీర్ఘకాలిక సమస్యల బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేసవిలో ఎక్కువగా ఇమిడాక్లోప్రిడ్, థయామెథోక్సామ్ వంటి క్రిమిసంహారక మందులు వాడుతారు. ఇవి ఆరోగ్యానికి అంత మంచివి కావని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చూడండి: Nicholas Pooran : భయంకరమైన హిట్టర్.. 29 ఏళ్లకే 600 సిక్సులు!
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చూడండి: AP Man : అమెరికాలో ఆంక్షలు.. ఏపీ యువకుడు ఆత్మహత్య!